ఓటరుగా నమోదు చేసుకోవాలి


Mon,September 17, 2018 03:08 AM

-ఈ నెల 25 వరకు అవకాశం
- కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామరెడ్డి
కలెక్టరేట్: జిల్లాలో అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.వెంకట్రామరెడ్డి విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక ముసాయిదా విడుదల చేసిందనీ, దీని ప్రకారం ఈ నెల 25 వరకు అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఈ మేర కు ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. 2018 జనవరి 1 వరకు 18 సంవత్సరాలు నిండిన వారు, ఓటరు జాబితాలో పేర్లు గల్లంతైన వారు ఫాం-6 ద్వారా ఓటుహక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ ఫారం నింపి, ఫొటోతో సంబంధిత బూత్‌లెవల్ అధికారికి గానీ, వీఆర్వోలు, ఆర్‌ఐలు, తహసీల్దార్లకు ఇవ్వవచ్చని, లేదంటే ఆన్‌లైన్‌లో మీ-సేవ కేంద్రాల్లో, మొబై ల్ యాప్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని వివరించారు. జిల్లాలో ఉన్న 501 పోలింగ్ బూత్‌లకు ఒక్కో బూత్‌లెవల్ అధికారి (బీఎల్‌వో)ను నియమించామనీ, వీరంతా ఈనెల 25 వరకు సంబంధిత ఏరియాల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతి బూత్‌ను ప్రత్యేకంగా పరిశీలించేందుకు జిల్లా, మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో nvsp.in (నేషనల్ ఓటరు సర్వీస్ పోర్టల్)లో పరిశీలించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.

దరఖాస్తు చేసుకోండి ఇలా..
మాన్యువల్‌గా మీ పరిధిలోని పోలింగ్ కేం ద్రంలో ఉండే బూత్ లెవల్ అధికారికి దరఖాస్తుతోపాటు నాలుగు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, చిరునామా రుజువుపత్రం (వాటర్, వంటగ్యా స్, విద్యుత్ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర జిరా క్స్ ప్రతులు), వయస్సు నిర్ధారణకు వివరాలు జతచేయాలి. ఏడు పని దినాల్లో సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారి పేరును ఓటరు జాబితాలో చేరుస్తారు. ఆన్‌లైన్‌లో అయితే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఈ-రిజిస్ట్రేషన్ ఆప్షన్‌కు వెళ్లి నియోజకవర్గం, కొత్త దరఖాస్తు అయితే ఫారం-6, ఇప్పటికే ఉన్న జాబితాలో పేరు సరిగా లేకుంటే ఫారం-7, ఓటరు కార్డు సవరణకు ఫారం-8, చిరునామా మార్పిడికి ఫారం-8ఎ దరఖాస్తులు పూరించాలి. ఈ దరఖాస్తుల వివరాలను అప్‌లోడ్ చేసి సబ్‌మిట్ చేయాల్సి ఉంటుందన్నారు. జీహెచ్‌ఎంసీ మొబై ల్ యాప్ ద్వారా కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...