పకడ్బందీగా ఓటర్ల లెక్క


Mon,September 17, 2018 03:07 AM

-అర్హులకు అవకాశం.. అనర్హుల తొలగింపు
-యువతీయువకులు ఓటు హక్కు వినియోగించుకోవాలి
-డీఆర్‌డీవో రవీందర్
సిరిసిల్ల టౌన్: ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నమో దు ప్రక్రియ నిర్వహిస్తున్నామని డీఆర్‌డీవో రవీందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌నగర్ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారందరికీ జాబితాలో అవకాశం కల్పిస్తున్నామనీ, ఇదే సమయంలో అనర్హుల ఓటర్లను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా జల్లెడ పట్టడంలో భాగంగా మరణించిన వారి ఓట్ల తొలగింపు, రెండు చోట్ల నమోదైన ఓట్లను గుర్తించి, నోటీసులు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే 18సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించేందుకు పకడ్బందీ ప్రణాళితో మందుకు వెళ్తున్నామని చెప్పా రు. ర్యాలీలు, అవగాహన సదస్సులు, సమావేశాలు వంటి వివిధ కార్యక్రమాల ద్వారా ఓటు ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామనారు. ఇక్కడ ఐసీడీఎస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
అవగాహన కల్పించాలి
ఎల్లారెడ్డిపేట: 18సంవత్సరాలు నిండిన యువతీయువకులు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆర్డీవో శ్రీనివాస్‌రావు అధికారులకు సూచించారు. మండల కేంద్రంలో పలు ఓటరు నమోదు కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. ఓటరు నమో దు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఓటరు లిస్టులో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండల కేంద్రంతోపాటు వెంకటాపూర్, హరిదాస్‌నగర్‌లో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ నవీన్, అంగన్‌వాడీ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...