రైతులకు దళారుల బెడద ఉండదు


Mon,September 17, 2018 03:07 AM

వేములవాడ రూరల్ : రైతులకు దళారుల బెడద ఉండదనీ, పండించిన కూరగాయలను రైతులు నేరుగా రైతు బజారులో అమ్ముకోవచ్చని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం వే ములవాడ పట్టణంలోని వ్యవసాయామార్కెట్‌లో రూ.30 లక్షలతో నిర్మించిన రైతు బజారును మా జీ ఎమ్మెల్యే రమేశ్‌బాబుతో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వేములవాడ పట్టణ కూరగాయల మార్కెట్‌లో సరైన వసతులు లేకపోవడంతో వ్యవసాయ మార్కెట్‌లోనే రైతు బజారును ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీలతమహేశ్‌లు కోరటంతో మంత్రి హరీష్‌రావు తో మాట్లాడి రైతు బజారుకు నిధులు మంజూరి చేశామన్నారు.

అనంతరం ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాట్లాడుతూ రైతు బజారులో త్వరలోనే కూరగాయలు నిల్వచేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తామన్నారు. అనంతరం రైతులను రైతు బజారు నిర్మాణంపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీలతమహేశ్, నగర పంచాయతీ చైర్‌పర్సన్ ఉమ, మార్కెట్ కార్యదర్శి మల్లేశం, జడ్పీటీసీ శ్రీకాంత్, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్, టీఆర్‌ఎస్ మండల, పట్టణాధ్యక్షులు హన్మాండ్లు, పుల్కం రాజు, ప్రవీణ్, మా ర్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ దేవయ్య, సెస్ డైరెక్టర్లు రామతీర్థపు రాజు, శ్రీనివాస్, రమేశ్, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఫీర్‌మహ్మద్, మల్లేశం, అంజనీకుమార్, రా ములునాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్‌రావు, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ ర వి, మాజీ సర్పంచ్‌లు లక్ష్మణ్‌రావు, పిట్టల వెంకటేశ్, మ్యాకల రవి,నాయకులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...