చట్టాలపై అవగాహన ఉండాలి


Sun,September 16, 2018 02:46 AM

-జిల్లా సివిల్ జడ్జి శ్రీనివాస్
-విద్యార్థులకు అవగాహన సదస్సు
చందుర్తి : పారదర్శకమైన భారతీయ చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉం డాలని, స్వేచ్ఛాయుత సమాజాన్ని నిర్మించాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి యం. శ్రీనివాస్ విద్యార్థులకు పిలుపు నిచ్చారు. చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్యతిథిగా హాజరై విద్యార్థుల కు చట్టాలపై అవగాన కల్పించారు. న్యా య వినియోగం, కోర్టుల వర్గీకరణ, ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక విధులు, వాదోపవాదాలు, ఎఫ్‌ఐఆర్ తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) గురించి వి ద్యార్థులకు క్షుణ్నంగా వివరించారు. ఈ సందర్భంగా జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండడంతో నేరాల నియంత్రణ సులభమవుతుందని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థిదశ నుంచే మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకొని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆ యన ఆకాంక్షించారు. ముఖ్యంగా మద్యానికి, సెల్‌ఫోన్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని, తలిదండ్రులను, పెద్దలను గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ చందు ర్తి సీఐ విజయ్ కుమార్, ఎస్‌ఐ మల్లేశం గౌడ్, ప్రిన్సిపాల్ అ బ్దుల్ ముఖీద్, తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...