రైతు బజారును సద్వినియోగం చేసుకోవాలి


Sun,September 16, 2018 02:45 AM

-టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రం మహేశ్
- నేడు ప్రారంభానికి వస్తున్న ఎంపీ వినోద్‌కుమార్
వేములవాడ రూరల్ : వేములవాడ వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేస్తున్న రైతు బజారును రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనీ టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రం మహేశ్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ మార్కెట్‌యార్డులో నేడు జరిగే రైతు బజారు ప్రారంభ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రం మహేశ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం గురించి ఆలోచించి రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అలాగే వేములవాడ పట్టణ ప్రజలకు రైతు బజారు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే రమేశ్‌బాబు సహకారంతో వ్యవసాయ మార్కెట్‌యార్డులో రైతు బజారును ఏర్పాటు చేయాలని కొరగానే రూ.30 లక్షలను మంజూరి చేయటంతో పాటు సంవత్సరంలోపే రైతు బజారును ప్రారంభిస్తున్నామనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు పు ల్కం రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొంతుల అంజనీకుమార్, నాయకులు నామాల లక్ష్మిరాజం, ప్రసాద్‌రావు, తదితరులు ఉన్నారు.
నేడు రైతు బజారు ప్రారంభం
పట్టణ ప్రజలు ఎన్నో రోజులు ఎదురుచూస్తు న్న రైతు బజారు నేడు ఎంపీ వినోద్‌కుమార్ చే
తుల మీదుగా ప్రారంభించనున్నారు. ఉదయం 8 గంటలకు రైతు బజారు ప్రారంభం కానున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీలత పేర్కొన్నా రు. మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌బా బు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఈ కార్యక్రమానికి హాజరువుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నాయకులతోపాటు పట్టణ ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలనీ ఆమె విజ్ఞప్తి చేశారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...