11 రోజులు కృషి చేస్తే.. ఆరోగ్య ఓటరు జాబితా


Sat,September 15, 2018 03:12 AM

కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్ర రెండో ప్రత్యేక సమగ్ర సవర ణ ఓటర్ల ముసాయిదా జాబితా అభ్యంతరాలు, ప్రతిపాదనల స్వీకరణ ప్రక్రియను జనవరి 1, 2018వ తేదీ ప్రామాణికంగా తీసుకుని నేటి నుంచి 25వ తేదీ వరకు జిల్లా, మం డల స్థాయి అధికారులు 11 రోజులపాటు నిర్విరామంగా కృషి చేస్తేనే సమగ్ర ఆరోగ్య ఓటరు జాబితా సిద్ధమవుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామరెడ్డి అన్నా రు. ఆ దిశగా అధికారులు తమ బాధ్యతలను అంకితబావంతో నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర రెండవ ప్రత్యేక సమగ్ర సవరణపై జిల్లా, మండల స్థాయి అధికారులకు స్థానిక పద్మనాయక ఫంక్షన్ హాలులో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. నియమిత అధికారులు పనిలో నిమ్నగం కావాలని ఆదేశించారు. జిల్లాలో 501 పోలింగ్‌స్టేషన్ల పరిధిలో ఇప్పటికే బూత్‌లెవల్ అధికారులను నియమించామన్నారు. ఓటర్ల తుది జాబితాను పా రదర్శకంగా, పకడ్బందీగా రూపొందించేందుకు బీఎల్‌వోలకు అదనంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాల్టీల పరిధిలోని 100 పోలింగ్‌స్టేషన్లకు సంబంధించి ఒక జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించామన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మూడు నుంచి 4 పోలింగ్ కేంద్రాలకు మండలస్థాయి అధికారిని నియమించామని వెల్లడించా రు. అధికారులు ఇంటింటికీ తిరిగి కొత్త ఓటర్ల గుర్తింపు, మృతిచెందిన ఓటర్ల తొలగింపు, చిరునామా, పేర్లలో దొర్లి న తప్పులు, అభ్యంతరాలు, సవరణలు స్వీకరించాలన్నా రు. బీఎల్‌వోలు తప్పనిసరిగా విధులకు హాజరుకావాలన్నారు. అకారణంగా పోలింగ్ విధులకు గైర్హాజరైతే వారిని సస్పెండ్ చేసే అధికారం తహసీల్దార్లకు అప్పగిస్తున్నట్లు ప్ర కటించారు. సవరణ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేస్తా మన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితిని తుది జాబితా ప్రతిబింబించాలని ఆదేశించారు. అనంతరం జేసీ యాస్మిన్‌బా షా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కూలంకషంగా వివరించారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ రాహుల్‌శర్మ, ఆర్‌డీవో శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రమణాచారి తదితరులు పాల్గొన్నారు.

ఈఆర్‌వోనెట్-2.0 సాఫ్ట్‌వేర్‌పై
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన..
ఓటర్ల జాబితా సవరణకు రూపొందించిన ఎలక్టోరల్ రోల్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఈఎంఆర్‌ఎస్) స్థానంలో ప్ర వేశపెట్టిన ఈఆర్‌వోనెట్-2.0 సాఫ్ట్‌వేర్ వెర్షన్ పనివిధానం పై అన్ని జిల్లాల అధికారులు, ఈఆర్వోలకు వీడియోకాన్ష రెన్స్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం ఐటీ డైరెక్టర్ వీఎన్ శుక్లా శుక్రవారం రాత్రి అవగాహన కల్పించారు. రెండు మూడు ప్రాంతాల్లో ఓటును కలిగి ఉన్న ఓటర్లను ఈ సాఫ్ట్ వేర్ గుర్తిస్తుందన్నారు. ఓటర్ల పూర్తి సమాచారం ఉంటుందని పేర్కొన్నారు. అక్టోబరు 10 నాటికి తుది జాబితాను సిద్ధం చేయాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వెంకట్రామరెడ్డి, ఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...