బతుకమ్మను బతికిద్దాం..


Sat,September 15, 2018 03:12 AM

సిరిసిల్ల, నమస్తేతెలంగాణ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన బతుకమ్మ చీరల తయారీని విజయవంతం గా పూర్తి చేసేందుకు అన్ని వర్గాల నేత కార్మికులు ఏకం కావాలని, చీరల తయారీని పనిగా చూడకుండా, బా ధ్యతగా చూడాలని, చీరల తయారీలో అందరూ భాగస్వాములు కావాలని నేత కార్మికులకు కలెక్టర్ వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు. బతుకమ్మ చీరల తయారీపై మ్యాక్స్ సొసైటీ సభ్యులు, యాజమానులు, ఆసాము లు, ఇతర వస్త్రవ్యాపారుల సంఘాల నాయకులు, అధికారులతో సమన్వయ సమావేశాన్ని పొదుపు భవన్‌లో శుక్రవారం నిర్వహించారు. చీరల తయారీలో ఎదుర వుతున్న ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు ఉ న్న అవకాశాలపై వారితో కలెక్టర్ చర్చించారు. అనంతరం వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ పనిలేక నేతకార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రతి కార్మికుడికీ నెలకు రూ10 నుంచి రూ.20 వేల వేతనం అందించాలన్న గొప్ప సంకల్పంతో ప్రభుత్వం అన్ని రకాల బట్టల తయారీని సిరిసిల్లవాసులకు అప్పగించిందని వివరించారు. అందులో భాగంగానే బతుకమ్మ చీరల తయారీ సిరిసిల్ల కార్మికులకు వరంగా ప్రభుత్వం ఇచ్చిందని, ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయాల్సి న బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. 90 లక్షల చీరలకుగాను 6 కోట్ల మీటర్ల బట్ట తయారీకి 3.50 కో ట్ల మీటర్ల బట్ట తయారీ ఇప్పటికే పూర్తయిందని వెల్ల డించారు. సిరిసిల్లలో దాదాపు 20 వేలపైచిలుకు సాం చాలు ఉంటే అందులో 18000 సాంచాలు బతుకమ్మ చీరలనే తయారీ చేసున్నాయని తెలిపారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే వచ్చే నెల 12వ తేదీలోగా మిగ తా 2.50 కోట్ల మీటర్ల బట్ట తయారీ పూర్తికావాలని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బతుకమ్మ చీ రలు కాకుండా ఇతర బట్ట తయారీ చేస్తున్న కార్మికులు వెంటనే ఆ పనిని ఆపేసి, బతుకమ్మ చీరల తయారీలో నిమగ్నులవ్వాలని సూచించారు. బతుకమ్మ చీరలు నే యడం వల్ల ఏవైనా ఆర్థిక, ఇతరత్రా ఇబ్బందులు క లిగితే వాటి నష్టం పూడ్చేండుకు కావాల్సిన అన్ని చర్య లు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వస్త్రవ్యాపార సంఘాల నేతలు, అధికారులె బృందంగా వెళ్లి ఇతర రాష్ర్టాల్లో, జిల్లాల్లోని కార్మికులను తీసుకువచ్చేలా చర్య లు తీసుకోవాలన్నారు. ఇక్కడికి వచ్చే కార్మికులకు అన్ని వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.

ప్రత్యేక అధికారుల నియామకం..
చీరల తయారీ పర్యవేక్షణకు 10 మంది జిల్లా స్థా యి అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు ప్రక టించారు. ఒక్కో అధికారికి 100 నుంచి 200 సాంచె లు అప్పగిస్తున్నామని, రోజువారీ చీరల తయారీ కావాల్సిన ముడిసరుకుపై వారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తారని తెలిపారు. ప్రత్యేకాధికారులతో ప్రతి రెండ్రోజులకోసారి సమావేశం నిర్వహిస్తానని స్పష్టం చేశారు. రేపటి నుంచి ఏరియా వారీగా కార్మికులతో సమావేశమై బతుకమ్మ చీరల తయారీపై సన్నద్ధం చేస్తామన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ రాహుల్‌శర్మ, చేనేతజౌళీశాఖ డీడీ తస్లీమా, ఏడీ అశోక్, వస్త్రవ్యాపార సంఘాల నేతలు జిందం చక్రపాణి, మంచె శ్రీనివాస్, గోవింద్వ్రి, కట్టెకోల లక్ష్మీనారాయణ, ఆడెపు రవీందర్, దూడం శంక ర్, సత్యం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...