కొలువుదీరిన గణనాథులు


Sat,September 15, 2018 03:12 AM

వేములవాడ కల్చరల్: ఊరూరా గణనాథులు కొలువుదీరారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. విఘ్నరాజా.. నమోనమః అంటూ భ క్తులు ప్రణలిమిల్లారు. అందులో భాగంగా రాజన్న ఆలయంలో గురువారం గణపతి నవరాత్రోత్సవాలు కనులపండువగా ప్రారంభమయ్యాయి. ఆలయంలోని నాగిరెడ్డిమండపంలో కొలువుదీరిన గణనాథునికి అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో ఉదయం మూలవిరా ట్టు లక్ష్మీగణపతికి 11 మంది రుత్వికులతో అభిషేకపూజలు చేశారు. సాయంత్రం ఆలయ అద్దాలమండపంలో ప్రముఖ సంస్కృత పండితులు అష్టావధాని తిగుళ్ల శ్రీహరిశర్మ చవితి చంద్రదర్శన దోష నివారణార్థం శ్రీమత్ భాగవతంలోని శమంతకోపాఖ్యానం, చంద్రున్ని చూస్తే కలిగే నీలాపనిందలు తొలగించే ఘట్టాన్ని చక్కగా వివరించారు. అనంతరం గణేశపురాణ ప్రవచనం గావించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో దూస రాజేశ్వర్, ఏఈవో ఉమారాణి, ఆలయ స్థానాచార్యులు అప్పాల బీమాశంకర్, ప్రధానార్చకులు నమిలకొండ ఉమేశ్, చంద్రగిరి శరత్, ప్రతాప శ్రీనివాస్, అప్పాల వేణు, పురాణం శివప్రసాద్, గోపన్నగా రి నాగన్న, గణేశ్, చందు, కేశన్నగారి కృపాల్, ఉపాధ్యాయుల సంతోష్, చర్లపెల్లి కార్తీ క్ తదితరులు పాల్గొన్నారు. వినాయకచవితిని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భ క్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. తిప్పాపూర్‌లో నిర్వహించిన వేడు కల్లో తాజామాజీ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పాల్గొని పూజలు చేశారు.

రెండోరోజు ఘనంగా పూజలు
గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా రాజన్న ఆలయంలో కొలువుదీరిన మండపంలో గణనాథుడికి రెండోరోజైన శుక్రవారం ఆలయ అర్చకులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో రాజేశ్వర్, పర్యవేక్షకులు శ్రీరాములు, అర్చకులు పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...