కేసీఆర్‌తోనే గ్రామాలకు మహర్దశ


Sat,September 15, 2018 03:11 AM

సిరిసిల్ల రూరల్: సీఎం కేసీఆర్‌తోనే గ్రామాలకు మహర్దశ ప ట్టిందని, రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని టెస్కా బ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పిలుపునిచ్చారు. సిరిసిల్ల మండలం సర్దాపూర్ పరిధిలోని జగ్గారావుపల్లెలో నిర్మించతల పెట్టిన ముదిరాజ్ సంఘ భవన పనులకు ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ గడ్డం నర్సయ్య, ఎంపీపీ శ్రీలత, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ అగ్గిరాములుతో కలిసి ఆయన శుక్రవారం భూమి పూజ చేశారు. పనులను ప్రారంభించారు. అనంతరం కొండూరి ఆయన మా ట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌తోనే పంచాయతీల రూపురేఖలు మా రిపోయాయని, తండాలను జీపీలుగా చేశారని కొనియాడారు. మౌలిక వసతులతో పాటు కమ్యూనిటీ భవనాలకు భారీగా నిధు లు మంజూరు చేశారని, ఫలితంగానే గ్రామాలన్నీ సమగ్ర అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని వివరించారు. సిరిసిల్ల నియోవజవర్గంలోని ప్రతి గ్రామంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రూ.3 నుంచి రూ.6కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను అండగా ఉండి, ఆశీర్వదించాలని కోరారు. ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ గడ్డం నర్సయ్య మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నంబర్‌వన్‌గా రాష్ర్టాన్ని నిలపారన్నారు. కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని అన్నారు. ఎంపీపీ జూపల్లి శ్రీలత మాట్లాడుతూ మంచి మనసున్న మంత్రి కేటీఆర్ అని, నియోజవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని అన్నా రు. అన్నివర్గాల ప్రజలు కేటీఆర్‌కు మద్దుతు పలుకుతున్నారని అన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎంసీ వైస్ చైర్మన్ ఎరవెల్లి వెంకటరమణారావు, ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు పెరుమాండ్ల మల్లయ్య, జూపల్లి శ్రీనాథరా వు, సింగిల్‌విండో చైర్మన్ విజయేందర్‌రెడ్డి, శ్రీకాంత్, పె రుమాండ్ల రాములు, పర్శరాములు, రేగుల శ్రీనివాస్, లక్ష్మణ్, శ్రీనివాసరావు, రామచంద్రం, సల్లూరి తిరుపతిగౌడ్, బాలరాజుతోపాటు తదితరులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...