కేసీఆర్‌కే పట్టం కడదాం


Thu,September 13, 2018 01:10 AM

- 60 ఏళ్ల అభివృద్ధిని నాలుగేళ్లలోనే చేశాం..
- కాంగ్రెసోళ్లు కంటి పరీక్షలు చేయించుకోవాలి
- తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
- నియోజకవర్గంలో విస్తృత పర్యటన.. ప్రచారం
- నిమ్మపల్లి మూలవాగులో చేపపిల్లలు వదిలివేత
- మల్కపేట రిజర్వాయర్, నాగారం కోదండరామస్వామి ఆలయ పనుల పరిశీలన
- మహిళల మంగళహారతులు.ఘనస్వాగతం పలికిన నాయకులు
వేములవాడ, నమస్తేతెలంగాణ/కోనరావుపేట: అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అన్ని విధాలుగా రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కే పట్టం కడదామని తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని వేములవాడ, కోనరావుపేట మండలాల్లో బుధవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ పనులను పరిశీలించారు. నిమ్మపల్లి చెరువులో చేపపిల్లలను వదిలారు.

ప్రగతిని స్వాగతిద్దాం.. సీఎం కేసీఆర్‌కే పట్టం కడదాం అని వేములవాడ తాజామాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పిలుపునిచ్చారు. 60 ఏళ్లలో కాని అభివృద్ధిని నాలుగేళ్లలోనే చేశామని వివరించారు. పట్టణంలోని లేబర్‌అడ్డా, జాత్రాగ్రౌండ్‌లో ఆయన బుధవారం పర్యటించారు. స్థానికులతో కలిసిపోయారు. లేబర్ అడ్డాలో కార్మికులతో ముచ్చటించారు. వారితో కలిసి కుటుంబసమేతంగా ఆయన చాయ తాగారు. జాత్రాగ్రౌండ్‌లోని రాఘవేంద్ర ఉడిపి హోటల్‌లో అల్పాహారం చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తాజామాజీ ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఉద్యమ నాయకుడిగా రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ ప్రజలకు అవసరమయ్యే అనేక సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే నెరవేర్చారని గుర్తుచేశారు. రైతులకు సాగునీరు, పంట పెట్టుబడి సాయం, బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, ఆసరా, విద్య, వై ద్యం, కంటి వెలుగుతోపాటు అనేక ప్రతిష్టాత్మకమైన పథకాలను అమలుచేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వేములవాడ నియోజకవర్గంలో కేవలం నాలుగున్నరేళ్లలోనే రూ.3వేల కోట్ల అభివృద్ధి పనులను కూడా చేపట్టిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే ఉందన్నారు. వచ్చే ఎన్నిక ల్లో ఆశీర్వదించి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరా రు. ఆయన వెంట మున్సిపల్ అధ్యక్షురాలు నామాల ఉమ, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పుల్కం రాజు, అన్నారం శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులున్నారు.

కాంగ్రెసోళ్లు కంటి పరీక్షలు చేయించుకోండి..
మండలంలోని నిమ్మపల్లిలో రమేశ్‌బాబు ప ర్యటించారు. స్థానిక మహిళలు ఆయనకు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ 60ఏళ్ల పాలనలో గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసి చూపిందని, కాంగ్రెసోళ్లకు కనబడకపోతే కంటి వెలుగు శిబిరంలో పరీక్షలను చేయించుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో మల్కపేట రిజర్వాయర్ నిర్మించి రైతులకు లబ్ధిచేకూరాలని ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రతిపక్షాలకు కనబడడం లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని మళ్లీ గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్ పాలనకు జేజేలు పలుకుతున్నారని వివరించారు. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను ఎన్నుకుని బంగారు తెలంగాణలో భా గస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన పోషక ఆహారవారోత్సవాల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మండలంలోని నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టులో స్థాని క మత్స్యకారులు, సంఘం నాయకులతో కలిసి రమేశ్‌బా బు చేపపిల్లలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడు తూ మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి చేపపిల్లలను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వివరించారు. జిల్లాలో 291చెరువుల్లో 106.69లక్షల చేపపిల్లలను వదిలివేస్తున్నట్లు వెల్లడించారు. నిమ్మపల్లి మూలవా గు, మరిమడ్ల, వట్టిమల్ల చెరువుల్లో 3లక్షల 1305 చేపపిల్లలను వదిలామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్థికాభివృద్ధి సాధించేలా ముఖ్యమంత్రి పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు.

సబ్‌స్టేషన్ పనుల పరిశీలన
అనంతరం నిమ్మపల్లిలో నిర్మిస్తున్న 132/33కేవీ సబ్‌స్టేషన్ పనులను ఆయన పరిశీలించారు. సకాలంలో పనులను పూర్తిచేయాలని సూచించారు. పంటల సాగుకు కరెం టు సమస్య ఉండకుండ చేయడానికే సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇది పూర్తయితే స్థానిక ప్రజల చిరకాల వాంఛ నేరవేరుతుందని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ అందుతుందని ఆదేశించారు.

లక్ష ఎకరాలకు సాగునీరు..
మల్కపేట రిజర్వాయర్ 2బంట్‌లో నిర్మిస్తున్న కట్టపనులను రమేశ్‌బాబు పరిశీలించారు. మ్యాప్‌ను పరిశీలించి ప నుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కానుందని అన్నారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందించడమే తమ లక్ష్యమని అన్నారు. ఇక్కడి నుంచే నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టుకు లిఫ్ట్ వేయడానికి రూ.142కోట్లు మంజూరయ్యాయని, టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని వివరించారు. 3టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. దివంగత నేత చె న్నమనేని రాజేశ్వర్‌రావు కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. పనులు వేగంగా, నాణ్యతతో పూర్తిచేయాలని సూచించారు.

రూ.1కోటి 53లక్షలతో ఆలయ అభివృద్ధి
నాగారం గ్రామంలోని పొట్టిగుట్ట స్థలాన్ని సందర్శించా రు. ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ కోదండ రామస్వామి ఆలయాన్ని రూ.1కోటి 53లక్షలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే స్థలాన్ని పరిశీలించినట్లు వివరించారు. 17వ తేదీన ఆలయం ఆవరణలో ఇషా ఫౌండేషన్ ఆధ్యాత్మిక సద్గురు పనులను ప్రారంభిస్తారని తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు అదేశానుసారం ఎంపీ వినోద్‌కుమార్‌తో పాటు తాను కూ డా హాజరుకానున్నట్లు వివరించారు. ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలిసి పనులకు ప్రతిపాదించామని, రాను న్న రోజుల్లో పర్యాటక కేంద్రంగా మారనుందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ అన్నపూర్ణ, కొలనూర్ సింగిల్ విండో చైర్మన్ చంద్రయ్యగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ దేవయ్య, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాఘువరెడ్డి, జిల్లా రైతు కమిటీ మెంబర్ శంకర్‌గౌడ్, ఎంపీటీసీ రజిత, నాయకులు రవీందర్, లక్ష్మణ్, సంతోష్, జీవన్‌గౌడ్, రమణారెడ్డి, పోలాస నరేందర్, సతీశ్, సుమన్, శ్రీనివాస్, శేఖర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...