మట్టి గణపతే నమోనమః


Thu,September 13, 2018 01:10 AM

-పీఓపీ విగ్రహాలను నివారిద్దాం..
-పర్యావరణాన్ని కాపాడుదాం
-రంగుల వినాయకులతో ముప్పు
-పిండి, మట్టి ప్రతిమలపై పెరుగుతున్న ఆసక్తి
సిరిసిల్ల కల్చరల్ : ఏటా భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. 21 రకాల పత్రాలతో గణపతిని ఆరాధిస్తారు. పూర్వం గ్రామాల్లో ప్రతి వినాయక చవితికి చెరువులోని మట్టిని తీసి విగ్రహాలను తయారు చేసేవారు. అనంతరం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో విగ్రహాల తయారీ మొదలుపెట్టారు. ఆకర్షణీయంగా ఉండేందుకు రంగులు కృత్రిమ రసాయనాలు, నూనెలతో చేసిన పదార్థాలు విరివిగా ఉపయోగిస్తున్నారు. నిమర్జనంతో జలాశయాల్లో కలిసి కలుషితం చేస్తున్నాయి. కృత్రిమ రంగులతో జలచరాల శ్వాసక్రియ సక్రమంగా జరగక చనిపోతున్నాయి. పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల స్థానంలో మట్టి వినాయకులను పూజించాలని పర్యావరణ ప్రేమికులు తరచూ అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు ఆవరణలో అరకాల మహేశ్ పిండి, మట్టితో గణపతులను తయారు చేస్తున్నారు. పిండి విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా కృషి చేస్తున్నారు. మహేశ్ పిండితో వినాయకుని విగ్రహాలను తయారు చేయడం తమిళనాడులో నాలుగేళ్లు నేర్చుకున్నా డు. అనంతరం మొదటిసారిగా జిల్లాలో విగ్రహాలను తయారు చేసి అమ్ముతున్నాడు. విగ్రహాలు కూడా ఇద్దరు లేపేవిధంగా ఇబ్బందులు లేకుండా, 7 ఫీట్ల వరకు ఉండే భారీ వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. విగ్రహం ఎత్తును బట్టి రూ.2500 నుంచి రూ.6500 వరకు అందుబాటులో ఉన్నట్లు మహేశ్ తెలిపారు.

నియామకం
వేములవాడ రూరల్: వేములవాడ నియోజకవర్గం మున్నూరు కాపు యూత్ ఇన్‌చార్జిగా మెట్ల విజయ్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా బుధవారం విజయ్ మాట్లాడుతూ మున్నూరుకాపుల ఐక్యతను చాటుతూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. తనను నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...