పేదింటి పెద్ద కొడుకు కేసీఆర్


Thu,September 13, 2018 01:09 AM

సిరిసిల్ల రూరల్: పేదింటి పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ అని, ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కావొద్దనే కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టి ఆర్థిక సాయం అందిస్తున్నారని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో 116 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దశాబ్దాలుగా జరగని అభివృద్ధిని నాలుగేళ్లలోనే జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధితోపాటు సంక్షేమంలోనూ రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. గత ప్రభుత్వాలు పేదింటి ఆడబిడ్డలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాలు కేవలం అధికారం, కుర్చీ కోసం ఆరాటపడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర సంపద పెరిగిన కొద్దీ సంక్షేమ పథకాలను విస్తరించే వెసులుబాటు ఉందన్నారు. రూ.లక్ష 64వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘతన కేసీఆర్‌దేనని కొనియాడారు. నిండు మనసుతో రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. అనంతరం తంగళ్లపల్లి కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ. కోటి 15వేల 224 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. తొలుత సెస్ చైర్మన్ దొర్నాల లకా్ష్మరెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య , ఎంపీపీ జూపల్లిశ్రీలత, జడ్పీటీసీ పుర్మాణి మంజుల మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంరెడ్డి, వైస్ ఎంపీపీ భాస్కర్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ రాజిరెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ రాణి, జూపల్లి శ్రీనాథారావు, పుర్మాణి రాంలింగారెడ్డి, ఎంపీటీసీలు అనిత, మానస, తంగళ్లపల్లి గ్రామ అధ్యక్షుడు జగత్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, దేవందర్, లక్ష్మి, కనకలక్ష్మి, నిర్మల, రాజు, జగన్, మాజీఎంపీపీలు దేవదాస్, గజభీంకార్ రాజన్న, టీఆర్‌ఎస్‌వై మండలాధ్యక్షుడు సంతోష్‌గౌడ్, రాజేశ్వర్‌రావు, హమీద్, తదితరులు పాల్గొన్నారు.

గొల్లపల్లి పాఠశాలలో సెమీ రెసిడెన్షియల్..
ఎల్లారెడ్డిపేట : దాతల సహకారంతో మండలంలోని గొల్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని డీఈవో రాధాకిషన్ కలిసి టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు బుధవారం ప్రారంభించారు. బడిని బతికుంచునేందుకు ఉపాధ్యాయుల కమిట్‌మెంట్ బాగుందని కితాబునిచ్చారు. ఇకనుంచి ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠాలను బోధిస్తారని వివరించారు. అందుకోసం ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఒక్కొక్కరూ రూ. 5వేలు మొత్తం రూ.75వేలు అందించగా పలువురు దాతలు ముందుకు రావడాన్ని అభినందించారు. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించడమేగాక మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని కొనియాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ కృషి ఫలితంగానే సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని అన్నారు. బంగారు తెలంగాణ స్వప్నాన్ని నిజం చేసేలా సీఎం కేసీఆర్ పథకాలను రూపొందించారని,ఆ గమ్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ రానున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుళ్లపల్లి నర్సింహారెడ్డి, ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అందె సుభాష్, మాజీ ఎంపీపీ ఎలుసాని మోహన్, ఎంపీటీసీ గుగులోత్ పెంటయ్య, నమిలికొండ శ్రీనివాస్, కొండరమేశ్, ఎంఈవె మంకు రాజయ్య, ప్రధానోపాధ్యాయులు రాధాకిషన్, తీగల ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...