మంత్రి కేటీఆర్‌కే సంపూర్ణ మద్దతు


Wed,September 12, 2018 02:21 AM

చిన్నబోనాలలో మహిళా సంఘాల గ్రూప్ లీడర్ల నిర్ణయం.. ప్రతిజ్ఞ
సిరిసిల్లరూరల్: మంత్రి కేటీఆర్‌కే మా సంపూ ర్ణ మద్దతు అంటూ సిరిసిల్ల మండలం చిన్నబోనాలలోని మహిళలు ప్రతినబూనారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు, ఆర్‌ఎస్‌ఎస్ గ్రామ కన్వీనర్ దడిగెల శ్రావణ్‌రావు సమక్షంలో గ్రామంలోని 42 మహిళా సంఘాల గ్రూప్ లీడర్లు స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం సమావేశమయ్యారు. మంత్రి కేటీఆర్‌కు రానున్న ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, ఆయ నను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతి జ్ఞ చేశారు. ఈ సందర్భంగా శ్రావణ్‌రావు మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజవర్గంతోపాటు గ్రామం లో సీసీరోడ్లకు రూ.3 కోట్లు, కమ్యూనిటీ భవనా లు, మహిళా సంఘ భవనానికి రూ.10లక్షలను మంత్రి అందించారని గుర్తుచేశారు. కేటీఆర్‌కు మ హిళలకు అండగా నిలవడంపై హర్షం వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ రాములు, గ్రామైక్య సంఘ అధ్యక్షురాలు తుమ్మల లావణ్య, సంధ్య, సీతక్క, రాజవ్వతోపాటు 42 మంది మ హిళా సంఘాల లీడర్లు పాల్గొన్నారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...