నాలుగేళ్లలోనే 40ఏళ్ల అభివృద్ధి


Wed,September 12, 2018 02:21 AM

-కాంగ్రెసోళ్లు దద్దమ్మలు
- మాజీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్
వేములవాడ, నమస్తేతెలంగాణ: గడిచిన నాలుగున్నర ఏళ్ల స్వల్ప కాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ 40ఏళ్ల అభివృద్ధిని సాధించారని మాజీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని కుటుంబ సమేతంగా ఆ యన మంగళవారం దర్శించుకున్నారు. మొక్కుల ను చెల్లించుకున్నారు. అనంత రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ శ్వర్ మాట్లాడుతూ.. స్వరాష్ట్రం సాధించుకున్నాక ఏడాది పాటు అధికారులు లేక పాలన అతంతమాత్రంగానే సాగిందన్నారు. మిగిలిన మూడున్న రేళ్లలో ఉద్యమనేతగా, స్వరాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ 40ఏళ్ల అభివృద్ధిని సాధించారని కొనియా డారు. 23 భారీ ప్రాజెక్టులను చేపట్టి కోటి ఎకరాల మాగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వివరించారు. ఆ పనులన్నింటినీ 70నుంచి 80శా తం పూర్తి చేశారన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే 16జిల్లాల్లోని 42లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని వివరించా రు. ఇక రైతులకు పెట్టుబడి సాయం, బీమా, 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నా రు. అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూనే ఆలయాలను కూడా అభివృద్ధి చేశారని గుర్తుచేశా రు. ఇక 50ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్ననాడు ఏం చేశారని ప్రశ్నించా రు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూ స్తుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. రైతులను పట్టించుకోకపోగా నీరు అడిగిన, కరెంటు అడిగిన దాడులు చేసిన చరిత్ర ఆ పార్టీదని మండిపడ్డారు. అధికారంలో ఉన్ననా డు చేతగాని దద్దమ్మల్లా వ్యవహరించారని, అప్ప టి సీఎం వైఎస్‌ఆర్‌తో కలిసి ఉద్యమ ద్రోహానికి పాల్పడిన సంగతి ప్రజలకు తెలుసని వివరించా రు. ప్రగతి రథ చక్రం ఆగకూడదనే ముందస్తు ఎ న్నికలను వెళ్తున్నామని, విజయం తమదేనని ధీ మా వ్యక్తం చేశారు. రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపిన కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల అనంతరం రాజేశ్వరస్వామిని మరోసారి దర్శించుకుంటానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో నాయకులు ఒద్దినేని హరిచరణ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...