పేదల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం


Wed,September 12, 2018 02:21 AM

-టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్
-సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత
సిరిసిల్ల రూరల్: పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలోని మంత్రి కేటీఆర్ నివాసంలో సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లోని పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.2లక్షల 2వేల ఆర్థికసాయం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాటాక్లడుతూ సిరిసిల్ల మండలం ముష్టిపల్లికి చెందిన శంకర్‌కు రూ.55వేలు, తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన సుజాతకు రూ.10వేలు, సారంపల్లికి చెందిన లావణ్య కు రూ.7,500, జిల్లెల్లకు చెందిన నవ్యకు రూ.12,500, మండెపల్లికి చెందిన నాగయ్యకు రూ.47,500, నర్సింహుల పల్లెకు చెందిన తిరుపతి రూ.20వేలు, రామన్నపల్లెకు చెందిన మల్లేశంకు రూ.50వేలు మంజూరుకాగా ఆర్థికసాయం చెక్కులను అందజేసినల్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రికేటీఆర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కోడూరి భాస్కర్‌గౌడ్, ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్లు వొజ్జల అగ్గిరాములు, రాజిరెడ్డి, జూపల్లి శ్రీనాథరావు, దడిగెల శ్రావణ్‌రావు, పడిగెల రాజు, మాజీఎంపీపీలు బండిదేవదాస్, గజభీంకార్ రాజన్న, సిలువేరి రాజు, గొల్లపల్లి బాలయ్యగౌడ్, మంద నర్సయ్య, జగత్, వెంకటరాములు, గంగయ్య, భాస్కర్, సంతోష్, జగన్, భానుమూర్తి, దేవందర్, అన్ని గ్రామాల్లోని మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.

ఓటరుగా నమోదు చేసుకోవాలి
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్ పిలుపునిచ్చారు. సిరిసిల్లలో మంత్రికేటీఆర్ నివాసంలో జరిగిన అన్ని గ్రామాలోని పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 25లోపు 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటరు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఘాట్‌రోడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతులకు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్ ఆధ్వర్యంలో నాయకులు ది గ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించి,నివాళులు అర్పించారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...