ఉత్తమ్‌ది నిరంకుశ నాయకత్వం


Wed,September 12, 2018 02:20 AM

-కట్కం, పొన్నంవి నీతిమాలిన రాజకీయాలు
-కావాలనే తనపై దుష్ప్రచారం చేశారని విమర్శ
-మనస్తాపంతోనే పార్టీని వీడా
-కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి చీటి ఉమేశ్‌రావు
సిరిసిల్ల టౌన్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిరంకుశ నాయకత్వ ధోరణి అవలంభిస్తున్నారనీ, నాయకులన గ్రూపులుగా విడదీస్తున్నారని కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి చీటి ఉమేశ్‌రావు అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి ఉమేశ్‌రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పిలుపుమేరకు కాంగ్రెస్‌లో చేరి నేటివరకు పార్టీ అభ్యున్నతి కోసం వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యుడినయ్యానన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో గ్రామగ్రామాన తిరిగి ముమ్మర ప్రచారం చేశానని చెప్పారు. ఇలాంటి క్రమంలో పొన్నం ప్రభాకర్, కట్కం మృత్యుంజయంలు చెప్పిన నిరాధారమైన మాటలు నమ్మి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనపై అణచివేత ధోరణికి పూనుకున్నాడని ఆరోపించారు. ఉత్తమ్‌కుమార్ వ్యవహారంతో పార్టీ భ్రష్టుపట్టిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. డీసీసీ అధ్యక్షుడు కట్కం మృత్యుంజయం ఓ చీటర్ మహిళ వద్ద రూ.20 లక్షలు తీసుకుని మోసం చేశాడనీ, ఈ విషయంపై గాంధీభవన్‌లోనే సదరు మహిళ రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేసిందన్నారు. పొన్నం ప్రభాకర్ తన సోదరుడి పైరున అక్రమంగా మైనింగ్ లీజుకు పొంది నిర్వహిస్తున్నారనీ, ఇరిగేషన్ స్థలంలో పెట్రోల్‌బంక్‌ను ఏర్పాటుచేశారని ఆరోపణలు చేశారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కోవర్టు అనే ముద్రవేసి దుష్ప్రచారం చేసింది వీరిద్దరేనని అన్నారు. మహిళను మోసం చేసిన కట్కం మృత్యుంజయం, అక్రమంగా మైనింగ్ లీజు పొందిన పొన్నం ప్రభాకర్‌లపై పార్టీ పరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేయాలని సవాల్ విసిరారు. సమావేశంలో తిరుపతి, భాస్కర్‌రెడ్డి, బుర్ర మల్లేశంగౌడ్, వీరబోయిన మల్లేశ్ యాదవ్, తదితర నాయకులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు..
కాంగ్రెస్ పార్టీని వీడిన ఉమేశ్‌రావు కారెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఆయన వెంట పనిచేసిన అనుచరవర్గం టీఆర్‌ఎస్ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అనుచర నేతల సూచన మేరకు గులాబీ గూటికి చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...