ఓటర్ నమోదులో నిర్లక్ష్యం వహించొద్దు


Wed,September 12, 2018 02:20 AM

-అక్టోబర్ 8 వరకు తుదిజాబితా సిద్ధం చేయాలి
-జేసీ యాస్మిన్ బాషా
-బీఎల్‌వోలు, తహసీల్దార్లకు అవగాహన
వేములవాడ రూరల్ 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులను ఓటర్‌గా నమోదు చేయాలని, బీఎల్‌వోలు నిర్లక్ష్యం చేయరాదని జేసీ యాస్మిన్ భాషా పేర్కొన్నారు. మంగళవారం వేములవాడ మండల పరిషత్ ఆవరణలోని సినారె కళామందిరంలో నియోజకవర్గ బూత్‌స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్ పరిధిలో బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఇంట్లో మృతిచెందిన వారుంటే ఓటర్ జాబితా నుంచి తొలగించాలనీ, కొత్త ఓటర్ ఉంటే దరఖాస్తు చేసుకొవాలని సూచించాలన్నారు. నియోజకర్గంలో 231 పోలింగ్‌స్టేషన్లున్నాయనీ, ఇప్పటి వరకు దాదాపు 1.74 లక్షల మంది ఓటర్లుగా ఉన్నట్లు తెలిపారు. అక్టోబర్ 8 వరకు ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. జాబితాలో పోలింగ్‌స్టేషన్ పరిధిలో తప్పులు జరిగితే బీఎల్‌వోపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పోలింగ్‌స్టేషన్లలో అన్ని సౌకర్యాలుండాలనీ ఏమైనా లోపాలుంటే సంబంధిత తహసీల్దార్లకు సూచించాలన్నారు. ఈనెల 15,16 తేదీల్లో పోలీంగ్‌స్టేషన్ పరిధిలోనే బీఎల్‌వోలు ఉండాలనీ, దరఖాస్తులను తీసుకోవాలన్నారు. అనంతరం బీఎల్‌వోలకు పలు సూచనలు చేశారు. త హసీల్దార్లు నక్క శ్రీనివాస్, మునీందర్, మధు, నరేశ్, రమేశ్, సదానందం, డిప్యూటీ తహసీల్దార్ నవీ న్, ఆర్‌ఐలక్ష్మణ్, వీఆర్‌వోలు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...