కంటి వెలుగుకు అపూర్వ స్పందన


Wed,September 12, 2018 02:20 AM

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు అపూర్వ స్పందన లభిస్తున్నది. 13 మండలాల్లో 13 వైద్య బృందాలు ఉదయం నుంచి మొదలుకొని రాత్రి 8గంటలకు కంటి పరీక్షలు జరుపుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక అధికారి శ్రీరాం, కనుకుంట్ల భాస్కర్ ఆధ్వర్యంలో కంటి శిబిరాల పనితీరును నోడల్ అధికారులు పరిశీలిస్తున్నారు. మంగళవారం 1288 మందికి కంటి పరీక్షలు చేశారు. 664 మందికి అద్దాలు ఇచ్చారు. 166 మందిని కరీంనగర్‌లోని రేకుర్తి కంటి వైద్య శాలకు రెఫర్ చేశారు. ఇప్పటి వరకు 43,407 మందికి పరీక్షలు నిర్వహించారు. 9,744 మంది కి అద్దాలు పంపిణీ చేశారు. 3030 మందికి అపరేషన్ల కోసం కరీంనగర్, హైదరాబాద్ కంటి దవా ఖానలకు పంపించారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...