రాజన్న హుండీ ఆదాయం @ 51లక్షల 5 వేలు


Wed,September 12, 2018 02:19 AM

వేములవాడ కల్చరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి హుండీ ఆదాయం రూ. 51 లక్షల 5 వేల 779 సమకూరినట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ వెల్లడించారు. మంగళవారం రాజన్న ఆలయ ఓపెన్‌స్లాబ్ పై నిర్వహించిన ఈ హుండీ లెక్కింపులో గ్రాముల 103 బం గారం, 5 కిలోల 200 గ్రాముల వెండి సమకూరిందనీ, కేవలం ఈ ఆదాయం 5 రోజులది మాత్రమేనని వెల్లడించారు. ఓ అ జ్ఞాత భక్తుడు వెండికవచాలు ,వెండి కిరీటాలను హుండీ లో వేసినట్లు అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఏఈవోలు, పర్యవేక్షకులు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, వేములవాడ, సిరిసిల్ల సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో 400 మంది సత్యసాయి భక్తులు పాల్గొన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...