కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి


Tue,September 11, 2018 01:19 AM

చందుర్తి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేశ్ పిలుపునిచ్చారు. సోమవారం లింగంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో జిల్లా ఇన్నోవేషన్ అధికారి సుమన్ మోహన్‌రావుతో కలిసి అల్లాడి కంటి వెలుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో గ్రామీణ వైద్యానికి నూతన శోభ సంతరించుకుందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో విద్య, వైద్యానికి విశేష ఆదరణ వస్తుందని, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు చాలా మెరుగుపడ్డాయని చెప్పారు. కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వైద్యులు కంటి పరక్షలు నిర్వహించగా పలువురికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఇందూరి రాములు, మండల వైద్యాధికారి యండి మసూద్, మాజీ సర్పంచ్ ఇందూరి రాములు, గాజుల సత్తయ్య, పాల్గొన్నారు.

కంటి వెలుగుతో పేదింట్లో వెలుగులు
-వైద్యుడు మోహన్‌కృష్ణ
కోనరావుపేట: ప్రభుత్వం ఏర్పాటు చేసి కంటి వెలుగు పేదింట్లో వెలుగులు నింపుతుందని మండల వైద్యాధికారి మోహన్‌కృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని నిజామాబాద్ జిల్లా పరిషత్ పాఠశాలలో వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ నిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకే ప్రభుత్వం కంటి వెలుగు అనే బృహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 120 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి, పలువురికి కళ్లద్దాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వినయ్, ఆప్తమాలజిస్ట్ రాజు, సీహెచ్‌వో బాలచందర్, ఏఎన్‌ఎంలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

మామిడిపల్లిలో వైద్యశిబిరం..
మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ఉచి త వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు వైధ్యాధికారి మోహన్ కృష్ణ తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామం లో 85 మందికి పైగా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను అందజేసినట్లు తెలిపా రు. ప్రతి ఇంటింటా తిరుగుతూ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న మురికి నీరు, నీటి నిల్వలను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో సీహెచ్‌వో బాలచంద్రం, ఏఎన్‌ఎం వరలక్ష్మి, ఆశ వర్క ర్లు సుజాత, జ్యోతి వైద్యసిబ్బంది ఉన్నారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...