ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు


Tue,September 11, 2018 01:19 AM

కలెక్టరేట్: జిల్లాలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి కలెక్టర్ పీ వెంకట్రామిరెడ్డి వివరించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల ఏర్పాట్లు, ఆర్‌వో, ఏఆర్‌వోల నియామకం తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మా ట్లాడుతూ వేములవాడ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి(ఆర్‌వో)గా జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో), సిరిసిల్ల నియోజకవర్గానికి రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్డీవో)ని ఆర్‌వోగా ప్రతిపాదించామని వివరించారు. త్వరలో డీఆర్‌వో, ఆర్‌డీవోలు విధుల్లో చేరుతారని ఆయ న తెలిపారు. సీఎస్ ఎస్‌కే జోషి మాట్లాడుతూ వివిధ జి ల్లాలకు బదిలీ చేసిన రెవెన్యూ అధికారులు ఈనెల 11క ల్లా విధుల్లో చేరాలని ఆదేశించారు.

బీఎల్‌వోలకు అవగాహన కార్యక్రమం..
ఫొటో ఎన్నికల రోల్స్‌పై, రెండవ స్పెషల్ సమ్మరీ రివిజన్‌పై బూత్‌స్థాయి అధికారులు, తహసీల్దార్లు, జిల్లా అధికారులకు స్థానిక పొదుపు భవనంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంక ట్రామిరెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు. ఓటర్ల ముసాయి దా జాబితాను జారీ చేశామని, 25 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను తెలుపుటకు గడువు ఉంటుందని వెల్లడించారు. 15, 16 తేదీల్లో గ్రామసభల్లో ఓటర్ల చదువులు, క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరించాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. అక్టోబరు 4న క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరించాలని ఆదేశించారు. డేటాబేస్‌ను అప్‌డేట్ చేసి ఓటర్ల జాబితా ముద్రణను అక్టోబరు 7న చేపట్టి, 8న తుది ప్రచురణ చేయాలని స్పష్టం చేశారు. ఓటరు జాబితా ప్రక్షాళనలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పక పాటిం చాలన్నారు. రెవెన్యూ, పోలీస్, బీఎల్‌వోలు సమష్టిగా పని చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అన్నారు.

సర్దాపూర్ గోడౌన్ తనిఖీ..
తొలుత జేసీ యాస్మిన్‌బాషా, డీఎస్‌పీ వెంకటరమణతో కలిసి సిరిసిల్ల మండలంలోని సర్దాపూర్ గ్రామంలోని గోడౌన్(ఏఎంసి)ను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడి వసతులను పరిశీలించారు. 800 బ్యాలెట్, 630 కంట్రోల్ యూనిట్లు, 680 వీవీపీఏటీలు గోడౌన్‌లో భద్రపరచనున్నట్లు వెల్లడించారు. సిరిసిల్ల ఆర్డీవో గోడౌన్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరిసారని తెలిపారు. 12వ తేదీ సాయంత్రంలోగా గోడౌన్‌లో మొబైల్, బ్యాగ్ స్టోరేజీ, ర్యాక్‌లు, అవసరమైన చైర్లు, టేబుళ్లు తదితర అన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈవీఎం గోడౌన్ సందర్శనలో కలెక్టర్ వెంట శిక్షణ కలెక్టర్ రాహుల్‌శర్మ, ఆర్‌అండ్ బీఈఈ విఘ్నేశ్వర్‌రెడ్డి, పీఆర్ ఈఈ కనకరత్నం తదితరులున్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...