రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ


Tue,September 11, 2018 01:19 AM

వేములవాడ కల్చరల్: పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం సోమవారం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజామున నుంచే భక్తులు పవి త్ర స్నానాలు ఆచరించి తమ ప్రీతి మొక్కైన కోడెమొక్కు తీర్చుకోవడం కోసం క్యూలైన్లో బారులు తీరి నిలడ్డారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, ఎత్తు బెల్లాన్ని పంచిపెట్టారు. ఉదయం స్వామివారికి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నా గిరెడ్డిమండపంలోని సోమేశ్వరస్వామివద్ద అభిషేకపూజలు, బాలత్రిపురసుందరి అమ్మవారి వద్ద కుంకుమ పూజలు, కళాభవన్‌లో కల్యాణ మొక్కులు, ఆలయంలో పల్లకీ సేవలు, పెద్దసేవల మొక్కులను భక్తులు చెల్లించుకున్నారు. వివిధ ఆర్జితసేవల ద్వారా రాజన్నకు సుమారు రూ.7లక్షల ఆదాయం సమకూరిందని, రాజన్నను దాదాపు 8 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. భక్తులకు ఇ బ్బందులు కలుగకుండా ఆలయ ఏఈవో ఉమారాణి,పర్యవేక్షకు లు, సిరిగిరి శ్రీరాములు, రాజశం, ఇన్‌స్పెక్టర్లు రాజశేఖర్, శ్రీనివాస్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి భక్తులు సులభంగా దర్శనం చేసుకునేందుకు వీలుకల్పించారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...