ప్రగతి ప్రాంగణాలు


Mon,September 10, 2018 03:08 AM

-ఊరూరా కేసీఆర్ గ్రామ ప్రగతి ప్రాంగణాలు
-బహుళ ప్రయోజనాలనునెరవేర్చే లక్ష్యంతో వేదికలు
-సామూహిక వేడుకలు, ఉత్సవాలు, సమావేశాలు, పేదలు శుభకార్యాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు
-మంత్రి కేటీఆర్ చొరవతో సిరిసిల్ల నియోజకవర్గానికి రూ. 23.92కోట్ల నిధులు
-మంజూరైనవి 92 భవనాలు
-పూర్తయినవి 7..
-పనుల పురోగతిలో 34
-హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణులు
పెండ్లి.. సమావేశం.. ఊరుమ్మడి ఉత్సవం నిర్వహించుకోవా లంటే గ్రామాల్లో దిక్కులచూడాల్సిందే. ఫంక్షన్ హాలు కోసమో, వసతులు ఉన్నచోటుకో పరుగులు తీయాల్సిందే. ఆర్థిక భారం, దూరం భారం భరించాల్సిందే. ఇకపై ఆ తిప్పలు తొలగనున్నా యి. సీఎం ఆలోచనల ఫలితంగా ఊరూరా కేసీఆర్ గ్రామ ప్రగతి ప్రాంగణాలు పురుడుపోసుకుంటున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రూ. 23కోట్ల 92లక్షలతో సిరిసిల్ల నియోజకవర్గానికి 92 భవనాలు మంజూరుకాగా ఇప్పటికే 7 భవనాల నిర్మాణం పూర్త య్యాయి. 34 ప్రగతిలో ఉన్నాయి. కొద్దిరోజుల్లో అన్ని భవనాలూ అందుబాటులోకి రా నుండగా గ్రామీణుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్లప్రతినిధి, నమస్తేతెలంగాణ: ఫంక్షన్ హాళ్లు లు కేవలం పట్టణాలకే పరిమితమవుతున్నాయి. దీంతో ఇంటి వద్ద కనీస వసతులు పల్లె ప్రజలు ఏదైనా చిన్న శుభ కార్యాన్ని నిర్వహించుకోవాలంటే పట్టణాలకు వెళ్లాల్సి వ స్తుంది. కల్యాణ మండపాలకు పెట్టే ఖర్చు వారి ఆర్థిక భారాన్ని మరింత రెట్టింపు చేస్తున్నది. అదీగాక గ్రామాల్లో ఏదైనా సమావేశం, సామూహిక ఉత్సవాలను నిర్వహిం చుకోవాలన్నా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది.

దీంతో ఉన్న ఇరుకు స్థలాల్లోనే టెంట్లు వేసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా కొంత భరించినా గ్రామీణ ప్రాంత పేదలు పరిస్థితి దయనీయం. సమీపంలో ఉన్న ఆలయాలు, ఇరుకుస్థలాల్లోనే అరకొర వసతులతోనే శుభకార్యాలు జరుపుకుంటూ అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ముఖ్యమం త్రి కేసీఆర్ ఊరుమ్మడి ఆస్తిగా ఉండేలా, బహుళ ప్రయోజ నాలను నెరవేర్చేలా గ్రామాల్లో ప్రత్యేక వేదికలను నిర్మిం చాలని ఆలోచనలు చేశారు. అవి కార్యరూపం దాల్చడం తో ప్రస్తుతం ఊరూరా కేసీఆర్ గ్రామ ప్రగతి ప్రాంగణా లు పురుడుపోసుకుంటున్నాయి.

అన్నివర్గాల ప్రజలు తమ కుటుంబ సభ్యులంతా శుభకార్యాలను ఘనంగా నిర్వహించుకునేలా భవనాల్లో అన్ని వసతులను కల్పిస్తు న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరికో భవనం నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. సుమారు 250 మందికి సరిపడేలా భవనాలను నిర్మిస్తున్నారు. అందు కోసం అధిక మొత్తంలో నిధులను మంజూరు చేశారు. ప్రగతి ప్రాంగణా ల్లో వివాహాలతో పాటు ఇతర శుభకార్యాలు జరుపుకొనేవెసులుబాటను కల్పించనున్నారు. అతితక్కువ అద్దెతో అన్నివర్గాల ప్రజలకు వాటిని అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలను తీసుకుంటున్నది.

కేటీఆర్ చొరవతో 92భవనాలు..
అన్నివర్గాల పేదల కోసం ఐటీ, మున్సిపల్ పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల ని యోజకవర్గంలో 92 ప్రగతి ప్రాంగణాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. అందు కోసం ఒక్కో భవ నానికి రూ. 26లక్షల చొప్పున మొత్తం భవనాలకు రూ. 23 కోట్ల 92లక్షల నిధులను సైతం మంజూరు చేసింది.
ప్రతి గ్రామానికో ప్రగతి భవనం..
ప్రతి ఊరికో భవనం నిర్మిస్తున్నారు. అందులో భాగం గా మొదటగా సిరిసిల్ల నియోజకవర్గంలోని 5 మండలాలకు కలిపి 92 మంజూరయ్యాయి. తంగళ్లపల్లి మండలానికి 34, ఎల్లారెడ్డిపేటకు 18, గంభీరావుపేటకు 16, వీర్నపల్లికి 7, ముస్తాబాద్‌కు 17 మంజూరు చేశారు. అందులో తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె, బద్దెనపల్లి, తాడూరు, బస్వాపూర్, ఇందిరమ్మకాలనీ, ముష్టిపల్లి, జిల్లెల్లలో మొత్తం ఏడు భవనాల నిర్మాణ పనులు ఇప్పటికే పూర్త య్యాయి. మరో 34 భవనాల నిర్మాణ పనులు తుది దశ కు చేరుకున్నాయి. 40 ప్రాంగణాల నిర్మాణ పనులు ప్రా రంభ దశలో ఉండగా 11 భవనాల నిర్మాణాలకు స్థలాల ను కేటాయించాల్సి ఉంది. పూర్తయిన భవనాలను కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించేందుకు సంబంధిత అధికారు లు సన్నాహాలు చేస్తున్నారు.
అన్ని వసతులు..
కేసీఆర్ గ్రామ ప్రగతి ప్రాంగణాల్లో అన్ని వసతులను కల్పిస్తున్నారు. కనీసం 10 గుంటల స్థలంలో ఒక్కో భవ నాన్ని నిర్మిస్తుండడం విశేషం. సమావేశాలు, వివాహాది శు భకార్యాలను నిర్వహించేందుకు వీలుగా వేదికను ఏ ర్పా టు చేస్తున్నారు. వరుడు, వధువుకు ప్రత్యేక డ్రెస్సింగ్ గదు లను నిర్మిస్తున్నారు. నల్లాలు, ఇతర అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నారు. కల్యాణ మండపాలుగా తీర్చిదిద్దుతున్న ప్రగతి భవనాల నిర్మాణంపై అన్ని వర్గాల ప్రజల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

150
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...