ఆర్థికంగా ఎదగాలి


Mon,September 10, 2018 03:06 AM

-ప్రభుత్వ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
-సహకార సంఘం చైర్మన్ చక్రధర్‌రెడ్డి
- లబ్ధిదారుడికి సబ్సిడీ ట్రాక్టర్ అందజేత
ముస్తాబాద్: స్వయం ఉపాధి కోసం ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునీ, ఆర్థికంగా ఎదగాలని ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ కనవేని చక్రధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రానికి చెందిన సుంచు శ్రీనివాస్, రాజయ్యకు 95శాతం సబ్సిడీతో ప్రభుత్వం నుం చి మంజూరైన ట్రాక్టర్‌ను ఆదివారం ఆయన అందజేసి, మాట్లాడారు. గతంలో పేదల సంక్షేమానికి ఏ ప్రభుత్వాలు పథకాలు అమలు చేయలేదన్నారు. కేసీఆర్ సర్కార్ ప్రతిఒక్కరూ ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో సబ్బండవర్ణాల ప్రజలకు ఉపాధి కల్పించారన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మండలానికి విరివిగా ట్రాక్టర్లు మంజూరైనట్లు చెప్పారు. అర్హులందరికీ ప్రభుత్వ, సంక్షేమ ఫలాలు అందించడమే మంత్రి కేటీఆర్ ఆశయమన్నారు. మంత్రి మంజూరు చేస్తున్న పనులకు స్థానిక ప్రజలు పూర్తి సహకారాలు అందించాలని కోరారు. గ్రామాల ప్రగతికి నిరంతరం శ్రమిస్తూ, అధిక నిధులు మంజూరు చేస్తున్న మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్ పార్టీకి మండల ప్రజలు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మట్ట రాజిరెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్నేని అంజన్‌రావు పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...