సృజనాత్మకతను వెలికితీయాలి


Mon,September 10, 2018 03:06 AM

-తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి
-చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ట్రస్టు చైర్మన్ వేదకుమార్
-రంగినేని ట్రస్టులో ముగిసిన పిల్లల పండుగ
సిరిసిల్ల రూరల్: పిల్లలలోని సృజనాత్మకతను వెలికితీయాలనీ, ఇందుకోసం తల్లిదండ్రులు వారికి స్వేచ్ఛనివ్వాలని చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ట్రస్టు చైర్మన్, దక్కన్ లాండ్, బాలచెలిమి, పిల్లల పత్రిక సంపాదకుడు వేదకుమార్ అన్నారు. సిరిసిల్ల మండలం రంగినేని సుజాతా మోహనరావు ఎడ్యుకేషనల్, చారిటబుల్ ట్రస్టులో రేగుపాటి (రంగినేని) లక్ష్మి పిల్లల పండుగ పేరిట రెండురోజుల పాటు జరిగిన సృజనాత్మక రచనా కార్యశాల ఆదివారం ముగిసింది. కాళోజీ జయంతిని పుస్కరించుకునీ ముందుగా పుష్పాంజలి కార్యక్రమా న్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు వేదకుమార్ ముఖ్యఅథితిగా హాజరై, మాట్లాడారు. పిల్లల పండుగ పేరిట జిల్లాలోని బడి పిల్లల కోసం రచనా కార్యశాల ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియడారు. బాల సాహితివేత్తలను ప్రోత్సహిస్తూ, సత్కరించడం సంతోషకరమనీ, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుగాలని ఆకాంక్షించారు.

బడీడు పిల్లలను నిర్భంద విద్య, కార్పొరేట్ విద్య పేరిట వారి స్వేచ్ఛను హరించవద్దని కోరారు. విద్యతోపాటు సమాజ సృహ, నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇస్తేనే, వారిలో వారిలోని సృజనాత్మకత వెలికి వస్తుందన్నారు. వారికి ఇష్టమైన మార్గం ఎంచుకునే అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. సాహిత్యం సమాజానికి దోహదపడాలని ఆకాంక్షించారు. అనంతరం బాల సాహితవేత్తలకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. పిల్లల పండుగలో పాల్గొన్న 260 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపిక లు అందజేశారు. చిన్నారులు రచించిన రచనలు, సాహిత్యాన్ని పుస్తక రూపంలో అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగినేని ట్రస్టు చైర్మన్ రంగినేని మోహన్‌రావు, రంగినేని నవీన్‌రావు, పత్తిపాక మోహన్, పెద్దింటి ఆశోక్, అరవింద్, గరిపెల్లి అశోక్, రామచంద్రమూర్తి, తిరుపతి, అశోక్, సురేశ్, రమేశ్, అంజన్‌రెడ్డి, బాల్‌రెడ్డి, దేవేంద్రచారీ, రాజేశం, ట్రస్టు సభ్యులు, విద్యార్థులు ఉన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...