పోలీసుల అదుపులో కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు


Mon,September 10, 2018 03:05 AM

-ఎస్సీ హాస్టల్ విద్యార్థినులను బాలకుమార్ వేధింపులు
-కేసు నమోదు చేయడంతో ఆత్మహత్యాయత్నం
సిరిసిల్ల క్రైం: సిరిసిల్లలో ఎస్టీ హాస్టల్ విద్యార్థినులను వేదిస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షుడు బండారి బాలకుమార్‌పై సిరిసిల్ల ఠాణాలో కేసులు నమోదయ్యాయి. పోలీసుల వివరాల ప్ర కారం.. సిరిసిల్లలోని అశోక్‌నగర్‌కు చెందిన బాలకుమార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. సిరిసిల్ల మున్సిపల్ వెనుకభాగంలో ఉన్న ఎస్టీ హాస్టల్‌లోని విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, సైగలు, అల్లరి చేస్తున్నాడు. ఆదివారం కూడా ఇలా ప్రవర్తిచడంతో సదురు విద్యార్థినులు 100డయల్ చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న బాలకుమార్‌కు అల్కహాల్ పరీక్షలు చేసేందుకు పోలీసులు సిరిసిల్ల ఏరియా దవాఖాన కు తరలించారు. తనను అకారణంగా పోలీసులు ఈవ్‌టీజింగ్ కేసు నమోదు చేశారని సాయంత్రం వేళలో ఠాణా ఎదుట ఒంటిపై కిరోసిస్ పోసుకుని బాలకుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వేధింపులతోపాటు ఆత్మహత్యయత్నానికి పాల్పడడంతో బాలకుమార్‌పై రెండు కేసులు నమోదు చేసినట్లు ఇన్‌చార్జి సీఐ అనిల్‌కుమార్ తెలిపారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...