వైద్య సాయం చేస్తాం


Mon,September 10, 2018 03:05 AM

-నెటిజన్ పోస్టుకు అమాత్యుడి స్పందన
-సుమన్ చికిత్సకోసం మంత్రి హామీ
ఎల్లారెడ్డిపేట: మండలం అక్కపల్లికి చెందిన కొం పల్లి సుమన్ వైద్య చికిత్సలకు సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఆదివారం స్పందించారు. వివరాల్లోకి వెళ్లితే.. పేద కుటుంబానికి చెందిన సుమన్ రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిన్నది. కాగా వీర్నపల్లి మండలం కంచర్లకు చెందిన సామల్ల దేవరాజు ట్విట్టర్ ద్వారా చికిత్స సాయం కోసం కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీంతో కేటీఆర్ స్పందించి చికిత్సకు సహకరిస్తామ ని స్పందించడంతో సుమన్ స్నేహితులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపా రు. కామారెడ్డిలో ప్రైవే ట్ లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కొంపెల్లి సుమన్ (29) విధులు ముగించుకుని ఎల్లారెడ్డిపేట నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. సాయి శివగార్డెన్ సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద అదుపుతప్పి కిందపడిపోయాడు. రోడ్డు పక్కన చెట్లు ఉం డడంతో ఆదివారం ఉదయం వరకు ఎవరు గుర్తించలేదు. మార్నింగ్‌వాక్ వెళ్లేవారు అతడిని గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులు అక్కడికి చేరుకుని కరీంనగర్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా వెన్నుపూస దెబ్బతిన్నదని వైద్యు లు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద దవాఖానకు తరలించారు.
ఆందోళనలో కుటుంబసభ్యులు..
సుమన్‌ను పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స కోసం రూ.4లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో నిరుపేద కుటుంబానికి చెందిన బాధితులు తల్లడిల్లుతున్నారు. అంత పెద్దమొత్తంలో వెచ్చించలేమని ఆవేదన చెందుతున్నారు. ఆయన దయనీయ స్థితిని గమనించిన స్నేహితులు తలా కొంత పోగు చేసి కుటుంబ సభ్యులకు అందించారు. ఇప్పటికే సుమన్ తండ్రి రాములు పక్షవాతంతో బాధపడుతున్నాడు. దాతలు చేయూతనందించాలని వారు వేడుకుంటున్నారు.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...