వ్యాయామం చేయాలి


Sun,September 9, 2018 02:50 AM

సిరిసిల్ల కల్చరల్: మహిళలు కచ్చితంగా వ్యాయామాలు చేయాలని, ఆ రోగ్యంపై తప్పక శ్రద్ధ తీసుకోవాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని సిరిసిల్ల మున్సిపల్ అధ్యక్షురాలు సామల పావని అన్నారు. వీ కెన్ మేక్ ఏ చేంజ్, డిగ్నిటీ డ్రైవ్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా ఆరోగ్యం అనే అంశంపై పట్ట ణంలోని వాసవీ కల్యాణ మండపంలో భారీ అవగాహన సదస్సును శనివా రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ అధ్యక్షు రాలు పావని పాల్గొని మాట్లాడారు. రుతుక్రమం సమయంలో మ హిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, వాటి నివారణకు పా టించాల్సిన జాగ్యత్తలు విద్యార్థులకు తెలియజెప్పారు. అమ్మతనం అనేది ఆడవారికి దేవుడిచ్చిన కమ్మటి వరమని ఆమె అభివర్ణించారు. చాలా మంది విద్యార్థి నులు రక్త హీనతతో బాధపడుతున్నారని, వారు తప్పక తగిన జాగ్రత్తలు పాటించాలని, వ్యాధుల బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ ఆరోగ్యంలో మహి ళ ఆరోగ్యం అత్యంత ముఖ్య ప్రాతను వహిస్తుందని వివరించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుం దని తెలిపారు. అనంతరం విద్యా ర్థులకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. విద్యా ర్థుల కుటుంబానికి వైద్య పరీక్షల పైన 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తక్షణ్ వైద్యశాల సిబ్బంది ఈ సందర్భంగా తెలిపారు. కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హె చ్‌ఆర్‌ఎస్ రేణు, వీ కెన్ మేక్ ఏ చేంజ్, డిగ్నిటీ డ్రైవ్ సభ్యులు అనూష, దీపి క, కార్తీక్, విహార్, విజయ్, పృథ్వీరాజ్ విద్యార్థులు పాల్గొన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...