అమాత్యుడిని ఆశీర్వదించండి


Sun,September 9, 2018 02:49 AM

సిరిసిల్ల రూరల్: మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే సిరిసిల్ల నియోజవర్గం కనీవినీ ఎరగగని రీతిలో అభివృద్ధి చెందిందని, రానున్న ఎన్నికల్లో ఆయనకు అందరూ అం డగా నిలవాలని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని పెద్దూరులో రూ.4. 60లక్షలతో చేపట్టనున్న ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు, బోరు బావి ఏర్పాటు, రూ.4.60లక్షలతో చేప ట్టనున్న ముదిరాజ్ సంఘ భవన నిర్మాణ పనులు, ఇప్పలపల్లిలో రూ.4లక్షలతో చేపట్టనున్న యాదవ సంఘ భవ న నిర్మాణ పనులు, బాబాజీ కాలనీలో రూ.4.60లక్షలతో చేపట్టనున్న బెడగ, బుడిగ జంగాల కమ్యూనిటీ భవన ని ర్మాణ పనులను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సమావేశాల్లో కొండూరి మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కేసీఆర్ ఆదర్శంగా నిలపారని కొనియాడారు. సంక్షేమంలో దేశా నికే దిక్సూచిలా నిలిచేలా చేశారని అన్నారు. మిషన్ భగీర థ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమాతోపాటు ఆ సరా, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి తదితర బృహత్తర పథకాలతో చెదరని ముద్ర వేసుకున్నారని తెలిపారు.

వాటితోపా టు అన్నికుల సంఘాలకు భవనాలకు నిధులు మంజూరు చేశారన్నారు. గ్రామాల్లోనూ కమ్యూనిటీ భవనాలను నిర్మి స్తున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సి రిసిల్లలో చారిత్రాత్మకమైన అభివృద్ధి జరిగిందన్నారు. దే శంలోనే సిరిసిల్ల నియోజవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు, మంతి కేటీఆర్‌కు అన్ని విధాలా అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండ లాధ్యక్షుడు అంకారపు రవీందర్, ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ అగ్గిరాములు, జూపల్లి శ్రీనాథరావు, పుర్మాణి రాంలింగారెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ గ్రామ కన్వీనర్ చెన్నమనేని కమలాకర్‌రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎరవెల్లి వెంకటరమణరావు, కారోబార్ గండ్ర రమేశ్‌రావు, ఆదిపెల్లి దేవగౌడ్, జెట్టి దేవ య్య, మాజీ సర్పంచ్ ర్యాకం రమేశ్, రెడ్యనాయక్, బాలరాజు, దేవయ్య, మహేశ్, లడ్డుబాయి, మాజీఎంపీపీ గజభీంకార్ రాజన్న, నవీన్‌యాదవ్, గంగు పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...