నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి


Sun,September 9, 2018 02:49 AM

కోనరావుపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడుత హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షింలని వెంకటపూర్ అటవీ శాఖ సెక్షన్ అధికారి బాపురాజు అన్నారు. శనివారం మండలంలోని నిజామాబాద్ గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం అధ్వర్యంలో సీతాఫలం మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నిజామాబాద్ గ్రామంలో అటవీ శాఖకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటుతున్నామని స్పష్టం చేశారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా గత ఏడాది గ్రామ శివారులో ఐదు ఎకరాలు అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకొని 4వేల సీతాఫలం మొక్కలు నాటామని తెలిపారు. దీంతో ముదిరాజ్ కులస్థులకు రానున్న రోజుల్లో ఉపాధి చేకూరుతుందని పేర్కొన్నారు. సీతాఫలం మొక్కలు నాటి వాటి రక్షణకు పాటుపడాలని బాధ్యత ఇచ్చినట్లు తెలిపారు. వెంకటాపుర్ సెక్షన్ పరిధిలో కోనరావుపేట మండలంలోని శింగాళప ల్లి, నిజామాబాద్, ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి, వెంకటాపూర్ గ్రామాలు ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో కానుగ, రావి, మర్రి, మారేడు, సీతాఫలం మొక్కలు నాటినట్లు చెప్పారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...