లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రావణ సందడి


Sun,September 9, 2018 02:49 AM

రుద్రంగి: శ్రావణ మాసం పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రహ్లాద గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయాన్ని మామిడి, అర టి ఆకులతో సుందరంగా అలంకరించారు. ఆల య పూజార్లు స్వామి వారికి ఉదయం 6గంటలకు వేద మంత్రాలతో, పంచాముృత అభిషేకం జరిపి ప్రత్యేక పూజలు చేశారు. స్థానికులే కాకుండా వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో స్వామి వారికి భక్తులు ఒడి బియ్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. శ్రావణ మాసం చివరి శనివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఒడిబియ్యం సమర్పించుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులతో కలిసి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ కమిటీ చైర్మన్ పిప్పరి మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు పడాల శంకరయ్య, అచ్యుత్, ఇప్ప మల్లేశం, సింగారపు గంగారెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...