భక్తజనసంద్రం


Sat,September 8, 2018 01:30 AM

వేములవాడ కల్చరల్ : శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. వేకువజాముననే భక్తులు పవిత్ర ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడెమొక్కు చెల్లించుకున్నారు. భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని,తామెత్తు బెల్లాన్ని పంచిపెట్టారు. శ్రావణమాసంలో భక్తుల రద్దీని పురస్కరించుకుని ఆలయ అధికారులు గర్భగుడిలో భక్తులు నిర్వహించుకునే అభిషేక పూజలు,అన్నపూజలు రద్దు చేశారు. నాగిరెడ్డి మండపంలోగల సోమేశ్వరస్వామివద్ద, రాజన్న అనుబంధ భీమేశ్వరాలయంలో అభిషేక పూజలు నిర్వహించుకున్నారు. భక్తులు క్యూలైన్లలో వేచి ఉంచి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కల్యాణాలు, కుంకుమపూజలు, పల్లకీసేవలు, పెద్దసేవలు నిర్వహించుకున్నారు. ఆలయ ఈవో దూస రాజేశ్వర్, ఏఈవో ఉమారాణి, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, రాజేశం, ఆలయ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ సౌకర్యాలు కల్పించారు. వివిధ ఆర్జితసేవల ద్వారా రాజన్నకు సుమారు రూ.13 లక్షల ఆదాయం సమకూరినట్లు, రాజన్నను దాదాపు 20 వేలకుపైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.

రాజన్న సేవలో
తాజా మాజీ ఎమ్మెల్యే రమేశ్‌బాబు
వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారిని శ్రావణ శుక్రవారం సందర్భంగా వేములవాడ తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్‌బాబు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి వారి మండపంలో అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో దూస రాజేశ్వర్ వారికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట నగర పంచాయతీ చైర్‌పర్సన్ నామాల ఉమ, టీ ఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎర్రం మహేశ్ తదితరులు ఉన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...