మెండుగా రాజన్న ఆశీస్సులు


Sat,September 8, 2018 01:29 AM

వేములవాడ, నమస్తేతెలంగాణ: వేములవాడ రాజన్న ఆశీస్సులు అనుగ్రహం వల్లే మళ్లీ వేములవాడ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉండేందుకు అవకాశం దక్కిందని తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. అసెంబ్లీ రద్దు, అభ్యర్థుల ఖరారు తరువాత మొ దటి విడుతలోనే వేములవాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెన్నమనేని రమేశ్‌బాబు పేరు ఖరారు కాగా శుక్రవారం ఆయన వేములవాడకు చేరుకున్నారు. నంది కమాన్ వద్ద నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు ఘన స్వాగతం ప లికారు. పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించిన అనంతరం సంగీత నిలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ సారథ్యంలో రాష్ర్టాన్ని సాధించిన అనంతరం గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనులతోనే టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. వేములవాడ నియోజకవర్గంలోనూ రూ.3వేల కోట్లతో అనేక అభివృద్ధి పనులను చేపట్టిన విషయం తెలిసిందేనన్నారు. ఎల్లంపల్లి నుంచి ఫాజుల్‌నగర్‌కు, కలికోట సూరమ్మ చెరువు ద్వారా కథలాపూర్ మేడిపల్లి మండలాలు, మల్కపేట రిజర్వాయర్ నుంచి నిమ్మపల్లి చెరువుకు కూ డా ఎత్తిపోతల ద్వారా నీరు అందించేందుకు రూ.147 కోట్ల నిధులు కూడా మంజూరై త్వరలోనే టెండర్ ప్రక్రియ కొనసాగుబోతుందన్నారు. వేములవాడ పట్టణానికి కూడా గుడిచెరువు మధ్యమానేరు ఎత్తిపోతల పథకం ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాల సాగునీటిని అందించడమే తన ముందు న్న లక్ష్యమన్నారు.

వేములవాడ పట్టణంలోని మౌలిక వసతులను పూర్తిచేసేందుకు మున్సిపల్, వీటీడీఏ సంయుక్తంగా చేపట్టబోయే అభివృద్ధి పనులకు రూ.43 కోట్ల్లు రెండు రోజుల క్రితమే వి డుదలయ్యాయన్నారు. అభివృద్ధి పనులు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై గ్రామగ్రామాన ప్రజలకు వివరించేందుకు వారం రోజుల్లో మండలాల వారిగా ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి స మాలోచన చేద్దామన్నారు. 2018లో గెలుపు మనదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల పనితీరును రా జకీయంగా ఎండగట్టి తీరుతామన్నా రు. అంతకుముందు మార్క్‌ఫెడ్ చైర్మ న్ లోకబాపురెడ్డి మాట్లాడుతూ గ్రామగ్రామాన కమిటీలను వేసి వచ్చే ఎన్నికలపై ప్రతి ఒక్కరూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. సమావేశం లో మున్సిపల్ అధ్యక్షురాలు నామాల ఉమ, ఎంపీపీలు తిప్పని శ్రీనివాస్, లోక భువనేశ్వరి, కుందారపు అన్నపూర్ణ, జడ్పీటీసీలు గుడిసె శ్రీకాంత్, నెల్లుట్ల పూర్ణిమ, అంబటి గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎర్రం మహేశ్ శ్రీలత, చెల్లపల్లి అంజయ్య, ముక్కెర గంగాధర్, వైస్‌చైర్మన్‌లు వర్ధినేని నాగేశ్వర్‌రావు, సుదవేణి గంగాధర్‌గౌడ్, దేవయ్య, గట్ల మీనయ్య, మండల అధ్యక్షులు ఊరడి ప్రవీణ్, గడ్డం హన్మండ్లు, నాగం భూమయ్య, రాఘవరెడ్డి, పట్టణాధ్యక్షుడు రాజు, సింగిల్ విండో చైర్మన్లు నీలం శ్రీనివాస్, హరిచరణ్‌రావు, భూమరెడ్డి, సెస్ డైరెక్టర్లు రాజు, జడల శ్రీనివాస్, తిరుపతి, అల్లాడి రమేశ్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, నాయకులు, మా జీ ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...