కంటి వెలుగుకు అపూర్వ స్పందన


Sat,September 8, 2018 01:29 AM

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ : కంటి సమస్యలు దూరం చేయడమే లక్ష్యంగా తె లంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది. జిల్లాలోని 13 మండలాల్లో 13 గ్రామాల్లో 13 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరాలలో కంటి పరీక్షలు చేయించుకోడానికి జనం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈశిబిరాలను సబ్బండ వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. డీఎంఅండ్‌హెచ్‌వో సుమన్‌మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారి డాక్టర్ శ్రీరాం, కనుకుంట్ల భాస్కర్, వైద్యులు, సిబ్బంది ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నిర్వహించిన శిబిరంలో 2,397 మందికి పరీక్షలు చేయగా, 532 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 199 మందికి ఆపరేషన్లు చేయించడానికి రేకుర్తి కంటి దవాఖానకు పంపించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 37,589 మందికి పరీక్షలు నిర్వహించగా, 8,455 మందికి అద్దాలు ఇచ్చారు. 2,689 మందికి మోతె బిందు ఆపరేషన్ల కోసం కరీంనగర్, హైదరాబాద్‌లలోని కంటి దవాఖాన లకు రెఫర్ చేశారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...