ఆరోగ్య తెలంగాణే లక్ష్యం


Fri,September 7, 2018 02:56 AM

-కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
-మండల వైద్యాధికారి మోహన్‌కృష్ణ
కోనరావుపేట: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మండల వైద్యాధికారి మోహన్‌కృష్ణ అన్నారు. గురువారం మండలంలోని నిజామాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ అంధత్వం, దృష్టి లోపంతో పాటు ఇతర కంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికీ శిబిరంలో 212మందికి కంటి పరీక్షలు చేసి అవసరం ఉన్నవారికి కళ్లద్దాలను అందజేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో వైద్యులు వినయ్, అప్తమాలజిస్ట్ రాజు, సూపర్‌వైజర్ చారి, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు ఉన్నారు.
చందుర్తి : అనంతపల్లిలో గురువారం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మండల వైద్యాధికారి ఎండీ మసూద్ తెలిపారు. స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రలజు పెద్దఎత్తున పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. కాగా తొలిరోజే 131 మందికి కంటి పరిక్షలు నిర్వహించి 27 మందికి కళ్లద్దాలను అందజేసినట్లు మండల వైద్యాధికారి ఎండీ మసూద్ తెలిపారు. అలాగే మరో 15 మందిని ఆపరేషన్‌కు సిఫార్స్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యురాలు నీరజ, టీఆర్‌ఎస్ నాయకులు ఐతం అంజయ్య, ఐతం తిరుపతి పాల్గొన్నారు.
వేములవాడ రూరల్ : మండలంలోని చెక్కపల్లి గ్రామంలో కంటి వెలుగు వైద్య శిబిరాన్ని సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ గొస్కుల రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కంటి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. మొదటి రోజు దాదాపు వందమందికి వరకు కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తుంగతుర్తి లక్ష్మణ్‌రావు, బాల్‌రెడ్డి, ఇన్‌చార్జి శంకర్‌రావు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...