నాణ్యతతో బతుకమ్మ చీరలు


Fri,September 7, 2018 02:55 AM

కలెక్టరేట్ : ప్రభు త్వం దసరా కానుకగా ఆడబిడ్డలకు అందించనున్న బతుకమ్మ చీరలు అరుదైన వస్ర్తాలతో తయారై నాణ్యతగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల స్టాల్స్‌ను గురువారం కలెక్టర్ తిలకించారు. బతుకమ్మ చీరల తయారీ విధానం, రంగులు తదితర అంశాలను మెప్మా సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సిరిసిల్లలో తయారు చేయిస్తున్న చీరలు అద్భుతంగా ఉన్నాయన్నారు. బతుకమ్మ చీరలు తీరొక్క రంగుల్లో అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మొత్తం 80కిపైగా రంగుల్లో చీరలను తయారు చేయిస్తున్నారన్నారు. ప్రస్తుతం 13 రంగుల్లో తయారైన చీరలను స్టాల్స్‌లో ప్రదర్శిస్తున్నామని మహిళలు కలెక్టర్‌కు తెలిపారు. బతుకమ్మ చీరల ప్రదర్శనను ఏర్పాటు చేసి మహిళల అభిప్రాయాలను స్టాల్స్ ద్వారా మెప్మా ప్రతినిధులు తెలుసుకున్నారు.

నెల రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
రానున్న నెలరోజుల్లో సిరిసిల్లలో చేపట్టిన 10.9 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రారామి రెడ్డి ఆర్‌అండ్‌బీ అధికారులు, సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు. గురువారం సాయంత్రం పట్టణంలో చేపడుతున్న రహదారుల అభివృద్ధి ప్రగతిపై కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులు, ఏజెన్సీలు, గుత్తేదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందనీ, ఇరువైపులా ప్రధాన రోడ్ల వెంబడి 5 కిలోమీటర్ల మేర అసంపూర్తిగా మిగిలి ఉన్న మురుగు కాల్వల నిర్మాణాన్ని రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 10.9 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధిలో మూడోవంతు విద్యుత్ స్తంభాలను చేయాల్సి ఉన్నందున సెస్ అధికారులు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, సూక్ష్మస్థాయి ప్రణాళికలతో టాస్క్ పూర్తి చేయాలన్నారు. శిక్షణ కలెక్టర్ రాహుల్‌శర్మ, ఆర్‌అండ్‌బీ ఈఈ విఘ్నేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...