పాలకవర్గ సభ్యుల ఎంపికపై హర్షం


Fri,September 7, 2018 02:55 AM

-ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మండల ప్రజాప్రతినిధులు
ముస్తాబాద్: పోతుగల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం పేర్లను ప్రభుత్వం ఖరారు చేయడంపై మం డల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఆ పద్ధర్మ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ముస్తాబాద్‌లో నూ తనంగా ఎంపిక చేసిన పాలకవర్గ సభ్యులను మం డల ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనం గా సన్మానించారు. చైర్మన్‌గా యాది మల్లేశ్‌యాదవ్, వైస్ చైర్మన్‌గా మట్ట రాణి, సభ్యులుగా అల్లం లక్ష్మణ్, ఆనంద్‌రావు, జ్వాల భిక్షపతి, స్వామి, విష్ణుప్రసాద్, శ్రీధర్‌న్ సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, జడ్పీటీసీ జనగామ శరత్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్‌రావు, సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సర్వర్‌పాషా, సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు, టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు కొమ్ము బాలయ్య, మాజీ ఎఏంసీ చైర్మన్ బత్తల అంజయ్య, టీఆర్‌ఎస్ నాయకులు మేర్గు యాదగిరి, అంజిరెడ్డి, కిషన్‌రావు, నల్ల నర్సయ్య, ఈసరి కృష్ణ. కట్ట బాపురావు, అన్వర్, కారంగుల వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...