భవిష్యత్తుకు పదే కీలక మలుపు


Tue,January 10, 2017 11:40 PM


గంభీరావుపేట: విద్యార్థులు భవిష్యత్తులో తమ లక్ష్యలను ఎంచుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే కీలకమైన మలుపు పదో తరగతి మాత్రమేనని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. మండలంలోని పదో తరగతి విద్యార్థులకు అందించే గోరుముద్ద కార్యక్రమాన్ని టెస్కాబ్ చైర్మ న్ కొండూరి రవీందర్‌రావు తో కలసి వారు ప్రారంభించా రు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలతో పాటు గోరంట్యాల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యుత్తులో ఉన్నత లక్ష్యాలను ఎంచుకోడానికి పదో తరగతి ఉత్తీర్ణత శాతం విద్యార్థులకు కీలక మలుపుగా పరిగణలోకి వస్తుందన్నారు.

చదువును మించిన ఆస్తి మరొకటి లేదని వారు విద్యార్థులకు సూచించారు. చదువు ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని తెలిపారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు 60 రోజుల సమయం ఉన్నందున ప్రణాళికాబద్దంగా చదివినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటారన్నారు. పాఠశాలలో ఉదయం సాయంత్రం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల్లో అల్పాహారం అందిచడానికి అందరి భాగస్వామ్యంతో పాటు దాతల సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని తెలిపారు.

మీరు కష్టపడి చదువుతున్న సమయంలో ఆకలికి గురికావద్దంటూ అల్పాహారాన్ని అందిస్తూ తమ భవిష్యతుకు బంగారు బాటలు వేసుకోవాలంటూ దాతలు చేస్తున్న కృషిని వమ్ముచేయవద్దని, ప్రతి ఒక విద్యార్థి 9 పాయింట్ల పైననే ఫలితాలు సాదిస్తూ 100 శాతం ఉతీర్ణత సాధించాలన్నారు. పదో తరగతిలో కష్టపడి చదివి జిల్లాకు మంచి పేరును తెలచ్చిపెట్టాలని సూచించారు. అనంతరం మండలంలోని 10-18 సంవత్సరాల విద్యార్థులకు మంజూరైన కేడీసీసీ బ్యాంకు ఏటీఎం కార్డులను కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. మండలంలోని 13 ఉన్నత పాఠశాలల్లో సుమారు 529 మంది పదో తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని అందిచడానికి కృషి చేసిన దాతలకు ప్రభుత్వం తరపున కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లుగారి పద్మ, ఎంపీపీ కమ్మరి గంగసాయవ్వ, సర్పంచ్‌లు పాపాగారి భూలక్ష్మీ, ఎర్రం లతిక, చెవుల మల్లేషం, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గోగు లింగంయాదవ్, ఎంపీటీసీలు వనం సావిత్రి, హమీద్, కొమిరిశెట్టి లక్ష్మణ్, మండల కోఆప్షన్ సభ్యులు మహబూబ్‌అలీ, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు దయాకర్‌రావు, మాజీ జడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, మండల విద్యాధికారి బంతిలాల్, తహసీల్దారు దార ప్రసాద్, ఎంపీడీఓ సురేందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు కమ్మరి రాజారాం, శ్రీకాంత్‌రెడ్డి, అంజిరెడ్డి, వెంకటస్వామి గౌడ్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాకమిటీ చైర్మన్‌లు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS