ఆదర్శ విద్యార్థులకు కలెక్టర్ పరామర్శ


Tue,January 10, 2017 11:39 PM


ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ఆదర్శ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలెక్టర్ కృష్ణభాస్కర్ మంగళవారం పరామర్శించారు. ఘటనపై పాఠశాల ఇన్‌చార్జి సంధ్యను వివరాలు అడగగా అస్వస్థతకు గురి అయింది ఏడుగురే అయినప్పటికీ వారి చేసుకుంటున్న తీరును చూసి మిగతా విద్యార్థులు మానసికంగా మాకేదో అవుతుందని ఇబ్బంది పడ్డారని తెలిపింది. సంఘటన జరిగిన వెంటనే స్థానిక ఆర్‌ఎంపీని పిలిచి కొంతమందికి ప్రాథమిక చికిత్సకూడా చేయించామని తెలిపింది. ప్రభుత్వ వైద్యురాలు శిరీష కూడా ఇదే విషయాన్ని తెలపడంతో వెంటనే ఎంఈఓ మంకు రాజయ్య ద్వారా వివరాలు తెలుసుకున్నారు. కలెక్టరు గతంలోనే ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై కొంత అనుమానంగా ఉందని అన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబందించిన ఖర్చుల వివరాలు మొత్తం తీసుకోవాలని వారిని ఆదేశించారు. అక్కడ ఏం జరుగుతుందో పూర్తి వివరాలు అందించాలని అన్నారు. సంఘటనపై ఒక్కొక్క అధికారి ఒక్కో కారణం చెప్పడంతో వెంటనే పాఠశాలకు వెళ్లి వివరాలు తెలుసుకోవాలని ఎంఈఓ, ఎంపీడీఓలను ఆదేశించారు.

మెడికల్ పీఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ మెడికల్ సూపర్‌వైజర్ ప్రసాద్‌ను విద్యార్థుల ఆరోగ్యస్థితిని తెలుసుకోవడానికి ఫోన్‌చేస్తే సరిగా స్పందించలేదని అన్నాడు. ఎక్కడ ఉన్నవాని ఆరాతీస్తే విద్యార్థులను హాస్పిటల్‌కు తీసుకవస్తే ఆయన పాఠశాలకు వెళుతున్నానని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని ఆగ్రహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరింనందుకు అతనికి వెంటనే మెమో జారీ చేయాలని డాక్టర్ శిరీషను ఆదేశించారు. వారివెంట తహసీల్దార్ పవన్‌కుమార్, ఎంపీడీఓ చిరంజీవి, ప్రిన్సిపాల్ నారాయణ, వైద్యురాలు శిరీష ఎస్సై ఉపేందర్ పలువురు అధికారులు ఉన్నారు.

ప్రిన్సిపాల్‌పై ఆరోపణ..


విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని అన్నారు. ప్రిన్సిపాల్ నారాయణ నాణ్యత విశయంలో రాజీపడుతున్నాడని, కూరగాయలు, పప్పుదినుసులు, కారంపొడి మొదలైన వాటి విషయంలో అక్రమాలు ఉన్నాయని విద్యార్థి నాయకులు, తల్లిదండ్రులు తెలిపారు. అస్వస్థ విషయం తెలిసిన వెంటనే డీఈఓ కార్యాలయానికి వెళుతున్నానని తప్పించుకోవడానికి ఉపాధ్యాయురాలు సంధ్యకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చాడని ఆరోపిస్తున్నారు. పాఠశాలలో వంట, భోజనం చేసే పరిసరాలు బాగాలేవని వీటిపైన నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. అధికారులు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం జరిగేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

డీఈవో కార్యాలయానికి..


విద్యార్థులతో పాటు తను కూడా భోజనం చేసి పాఠశాల పని కోసం మధ్యాహ్న డీఈఓ కార్యాలయానికి వెళ్లిన పిదప ఘటన జరిగిందని, విషయం తెలుసుకుని హుటాహుటిన తరలిరావడం జరిగిందని అన్నాడు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS