జిల్లా కేంద్రంలో ఫిర్యాదుబాక్స్‌ల ఏర్పాటు

Tue,January 10, 2017 11:36 PM


సిరిసిల్ల క్రైం: జిలా ్లకేంద్రంలోని కళాశాలలు, విద్యాసంస్థల యాజమాన్యాలకు మంగళవారరం ఎస్పీ విశ్వజిత్ ఫిర్యాదుల బాక్స్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విశ్వజిత్ జిల్లాలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పోలీస్ వాట్సఫ్ నెంబర్, పోలీస్ షీటీంల ఏర్పాటులో భాగంగానే ఫిర్యాదు బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బాక్స్‌లను బస్టాండ్, విద్యాసంస్థలతోపాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ బాక్స్‌ల తాళాలన్నీ తన వద్దే ఉంటాయని, వారం లేదా పది రోజులకో సారి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా పరీశీలిస్తానన్నారు. ఫిర్యాదుల సమస్యను బట్టి సంబంధిత అధికారులకు చేరవేసి, న్యాయం చేస్తానని ప్రకటించా రు.

ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచి సమస్య పరిష్కరించి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పోలీస్ షీటీంల ఏర్పాటు తో విద్యార్థినులు ప్రశాంతంగా కళాశాలలకు వస్తున్నారని కళాశాల యాజమన్యాల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జగన్‌గౌడ్ పేర్కొన్నారు. ఇందు లో సీఐ విజయ్‌కుమార్, పోలీస్ షీటీం ఎస్‌ఐ శ్రీనివాస్, కళాశాల యాజమాన్యాల కరస్సాండెంట్లు గుగ్గిల్ల జగన్‌గౌడ్, ఆకుల వెంకన్న, ఇటికల మల్లేశం, సంతోష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...