నకిలీ పాస్ పుస్తకాల ముఠా అరెస్ట్..


Tue,January 10, 2017 11:36 PM

కోనరావుపేట: నకిలీ పాస్తు పుస్తకాలను తయారు చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను మంగళవారం తెల్లవారుజామున జిల్లా సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ముగ్గురు ముఠాగా ఏర్పడి, నకిలీ పాసు పుస్తకాలు తయారు చేస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు ధర్మారంలో సభ్యులు ఇండ్ల పై దాడి చేశారు. ఈ దాడిలో స్టాంపులు, పాసు పుస్తకాలను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు కొలనూర్ సింగిల్ విండో డైరెక్టర్ ఉండగా, మరో ఇద్దరు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

ఈ ముగ్గురు సభ్యులు ఆర్డీవో, తహసీల్దార్ సంతకాలను ఫొర్జరీ చేయడంతో పాటు నకిలీ పాసుపుస్తకాలను తయారీ చేసి పలువురికి అంటగట్టారు. వీరు తయారు చేసిన నకిలీ పాసుపుస్తకాలతో కొందరు విజయ బ్యాంకులో లక్షల్లో క్రాపు రుణాలు పొందారు. అవసరం ఉన్నవారికి నకిలీ పాసు పుస్తకాలను ఇస్తూ వారి వద్ద నుంచి రూ.5 నుంచి పది వేల వరకు దండుకున్నారు. ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారితో సంబంధం ఉన్నవారు పరారీలో ఉన్నట్లు తెలిసింది.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS