ఆదర్శ పాఠశాల తనిఖీ

Tue,January 10, 2017 11:36 PM

వీర్నపల్లి: మండలంలోని ఆదర్శ పాఠశాలను మంగళవారం డాక్టర్ల బృందంతో ఎంఈవో మంకు రాజయ్య తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పరీక్షలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రతలపై అవగాహన కల్పించారు. పిల్లలు పడిగడుపున పాఠశాలకు వస్తున్నారని, దీంతో మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నం తిని అస్వస్థతకు గురవుతున్నారని ప్రిన్సిపల్ నారాయణ తెలిపారు. చాలామంది విద్యార్థులకు రక్తహీనత కూడా ఉందని డాక్టర్ శిరీష తెలిపారు. జడ్పీటీసీ తోట ఆగయ్య పాఠశాలలోని వంట గదిని పరిశీలించి, వంట సిబ్బందితో మాట్లాడారు. మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. డాక్టర్ల బృందం, ప్రజాప్రతినిధులు, ఎస్సై ఉపేందర్, ఎంపీడీవో చిరంజీవులు, సర్పంచులు సంజీవలక్ష్మి మల్లేశం, జోగుల సుదర్శన్, ఎంపీటీసీ లక్ష్మి జగన్, సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, ఉన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...