దేశాయిపేటను ఆదర్శంగా తీర్చిదిద్దాలి


Tue,January 10, 2017 11:35 PM


గంభీరావుపేట: మండలంలోని దేశాయిపేటను జిల్లాలో నగదు రహిత ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. మండలంలోని మంత్రి దత్తత గ్రామమైన దేశాయిపేటను మంగళవారం టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో కలిసి వారు నగదు రహితంపై గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో మొత్తం 377మంది ఖాతాలు పొందగా, అందులో అక్ష్యరాస్యులకు మంజూరైన 306డెబిట్ కార్డులను కలెక్టర్ సర్పంచ్ మమతతోపాటు గ్రామస్తులకు అందించారు. గ్రామంలో ప్రతిఒక్కరికి బ్యాంకు ఖాతాతోపాటు డెబిట్ కార్డులు ఉన్నందున్న ఇక నగదుతో పనిలేదన్నా రు. గ్రామంలో ఇక నుంచి నగదుకు స్వస్తిపలికి నగదు రహితంపై అవగాహన పెంచుకునేందుకు గ్రామంలో ఆరు స్వైపింగ్ మిషన్లను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వీటి ఆధారంగానే ప్రజలు వస్తువులను కొనుగోలు చేసుకుంటూ దేశాయిపేటను జిల్లాలో నగదు రహిత ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవడానికి కృషి చేయాలన్నారు.

అతి త్వరలో గ్రామానికి స్వైపింగ్‌మిషన్లను అందజేస్తామన్నారు. నగదు రహితంపై ప్రజలకు సందేహాలను తొలగిస్తూ అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం పింఛన్ పొందుతున్న వృద్ధులతో కలెక్టర్ కాసేపు ముచ్చటించారు ఆధార్‌కార్డు ద్వారా మీరు నగదు రహి త సేవలు వినియోగించుకోవచ్చని కలెక్టర్ వృద్ధులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దార ప్రసాద్, ఎంపీడీవో సురేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు లింగంయాదవ్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు కొమిరిశెట్టి లక్ష్మణ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు దయాకర్‌రావు, నేతలు కమ్మరి రాజారాం, శ్రీకాంత్‌రెడ్డి, కేడీసీసీ బ్యాంకు మేనేజర్ దామోదర్, సూపర్‌వైజర్ శ్రీనివాస్‌రెడ్డి, పం చాయతీ కార్యదర్శి రాంజేంద్రప్రసాద్, ఐకేపీ సీసీ లావణ్య, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS