సిరిసిల్ల ఎంపీపీ కమలబాయి రాజీనామా


Tue,January 10, 2017 11:35 PM


సిరిసిల్ల రూరల్: సిరిసిల్ల మండల పరిషత్ అధ్యక్షురాలు దడిగెల కమలాబాయి మంగళవా రం రాజీనామా చేశారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో చికోటి మధన్‌మోహన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎవరి ఒత్తిడిలేకుండా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. మండల అభివృద్ధికి సహకరిస్తానని, తనకు సహకరించిన సభ్యులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వైస్ ఎంపీపీ కొడూరి భాస్కర్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్, దడిగెల శ్రావణ్‌రావు, పుర్మాణి రాంలింగారెడ్డి, గోపాలరావు, ఎంపీటీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, రాజు ఉన్నారు. అనంతరం ఎంపీపీ నేరుగా కరీంనగర్‌కు వెళ్లి జడ్పీ కార్యాలయంలోని జడ్పీ డిప్యూటీ సీఈవో గౌతంరెడ్డికి రాజీనామా పత్రాన్ని అందజేశారు.

తాత్కాలిక ఎంపీపీగా భాస్కర్‌గౌడ్


కమలాబాయి రాజీనామా చేయడంతో వైస్‌ఎంపీపీగా ఉన్న కొడూరి భాస్కర్‌గౌడ్ తాత్కాలికంగా ఎంపీపీగా బ్యాతలు నిర్వహించనున్నారు. ఎంపీపీ రాజీనామా ఆమోదంతోపాటు కొత్త ఎంపీపీని ఎన్నుకునే వరకు భాస్కర్‌గౌడ్ ఎంపీపీగా కొనసాగనున్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS