హరిలో రంగ హరీ


Tue,January 10, 2017 11:34 PM

వేములవాడ కల్చరల్ :తలపై అక్షయపాత్ర, భుజాన తంబూర, చేతిలో చిరుతలతో దేవతలను స్మృతిస్తూ వీధుల్లో సందడి చేసే హరిదాసులు వచ్చారంటే ధ నుర్మాసంతో పాటు సంక్రాంతి కళ వచ్చినట్లే. వేకువజాముననే శ్రీ మద్రమారమణగోవిందో హరి.. అంటూ వినిపించే ఈ రాగాలు ఇప్పు డు వినిపించడంలేదు.
శ్రీహరి నామస్మరణతో వచ్చే హరిదాసులకు గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఆదరణ ఎక్కువగా ఉండేది. వారిని సాక్ష్యాత్తూ విష్ణురూపంలా పల్లెవాసులు భావిస్తారు. రైతుల లోగిళ్లు ధాన్యాగారాలతో నిండాలని, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ధానధర్మాలు చేస్తూ చల్లగా ఉండాలని వారు ఆకాంక్షిస్తారు. మహిళలు,పిల్లలు ఆనందంగా హరిదాసుల అక్షయపాత్రలో ధాన్యం వేస్తుంటారు. చార్వాక శ్రీ వైష్ణవ దాసులు, బుట్టదాసరుల కుటుంబానికి చెందిన కొందరు నేటికీ హరిదాసులుగానే కొనసాగుతున్నా ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. దోసిడు బియ్యం అందించే వారు కనిపించడంలేదని హరిదాసులు వాపోతున్నారు. వే ములవాడ మండలంలో సుమారు 8 కుటుంబాలకు చెందిన హరిదాసులు జీవనం సాగిస్తున్నారు.

ఆదరణ కరువవడంతో ఇప్పుడు ఒకరిద్దరు మాత్రమే ఈ వృత్తిని కొనిసాగిస్తున్నారు. సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో తాము ఈ నెలలో కఠోర దీక్షలో ఉంటూ హరినామస్మరణ చేస్తున్నట్లు వారు తెలిపారు. సంక్రాంతి నెల అంతా తిరిగినా సరిపడా బియ్యం రావడం లేదని హరిదాసు అల్గనవేరి నర్సిం లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఆదుకోవాలి


- అల్గనవేరి నర్సింలు. హరిదాసు. వేములవాడ
హరిదాసులుగా వేములవాడ పరిసర ప్రాంతాల్లో నివసించే మా కుటుంబాలు 30 ఏళ్లుగా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నాం. మా ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తగు రీతి లో స్పందించి హరిదాసులను హిం దూ మత ప్రచారకులుగా, హైందవ సంస్కృతిని పరిరక్షించేవారిగా గుర్తించాలి. కళాకారుల పింఛన్లు, ఇండ్లు, రేషన్ కార్డు, ప్రభుత్వ సదుపాయం మంజూరు చేయాలి. ఐదుగురు సంతా నం . వారిలో ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు వ్యా పారం చేస్తున్నాడు. చిన్నకొడుకు వేములవాడలో ఇడ్లీసెంటర్లో పనిచేస్తాడు.

అక్షయపాత్రే.. చిల్లిగవ్వ పడడంలేదు


- అప్పెనమేరి రాములు. హరిదాసు . దుబ్బాక, సిద్దిపేట జిల్లా
నేను 50 ఏళ్లుగా హరినామస్మరణచేస్తూ నిత్యం ఏదో ఊరిలో ఇలా అడుక్కుంటున్నాను. హరిదాసులకు ఈ కాలంలో ఆదరణలేదు. నానెత్తిన పెట్టుకున్నది అక్షయపాత్రే కానీ, దాం ట్లో చిల్లిగవ్వ, తవ్వెడు బియ్యం పడడంలేదు. నాకు ముగ్గురు సంతా నం. ఒక కొడుకు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.

221
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS