చేనేతకు ఊతమిద్దాం


Tue,January 10, 2017 11:33 PM


రాజన్న సిరిసిల్ల, ప్రతినిధి నమస్తేతెలంగాణ : నేత కార్మికులను ఆదుకునేందుకు చేనేత వస్ర్తాలు ధరించాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో, తానూ చేనేత వస్ర్తాలను ధరిస్తున్నానని సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం సి రిసిల్లలోని మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్ నివాసానికి వ చ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ రక్షణకు కంకణ బద్దుడైన సైనికుడు, అన్నం పెడుతున్న రైతు, కట్టుకోడానికి వస్త్రం ఇచ్చిన నేత కార్మికుడిని ఈ రోజు మనం మరిచి పోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తన అభిమానులు కూడా చేనేత వస్ర్తాలను ధరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక నుంచి ఎలాంటి కార్యక్రమాలకైనా తాను చేనేత వస్ర్తాలు ధరించే వెళ్తానని చె ప్పారు. విదేశీ వస్ర్తాలు.. దాహార్తి తీర్చని సముద్రపు నీటితో సమానమన్నారు. కార్యక్రమంలో సంపూర్ణేశ్‌బాబు రాష్ట్ర అభిమాన సంఘం అధ్యక్షుడు గిరి యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS