విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి


Tue,January 10, 2017 11:33 PM


కోనరావుపేట : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా సూచించారు. మండలంలోని కొలనూర్, నిజామాబాద్ గ్రామాల్లో మంగళవారం ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు స మయపాలన పాటించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యా బోధన సాగించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సక్రమంగా పౌష్టికాహారం పంపిణీ చేయాలన్నారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చ రించారు. పాఠశాలలో విద్యాబోధన సక్రమంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలూ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఐసీడీఎస్ పీడీ సరస్వతి, తదితరులు ఉన్నారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS