రైలు మార్గంతో అభివృద్ధి జోరు


Tue,January 10, 2017 02:37 AM


రాజన్న సిరిసిల్ల, ప్రతినిధి నమస్తే తెలంగాణ: కొత్త ప ల్లి- మ నో హ రా బాద్ రైలు మార్గంతో కార్మిక, ధార్మిక క్షేత్రాల్లో అభి వృద్ధి జోరం దు కుం టుం దని ఎంపీ బోయి ని పల్లివినో ద్ కు మార్ ఆశా భావం వ్యక్తం చేశారు. సోమ వారం సిరి సి ల్ల లోని పొదుపు భవ నంలో కలె క్టర్ కృష్ణ భా స్కర్ అధ్య క్ష తన జరి గిన రైలుమార్గ నిర్వా సి తుల సమా వే శా నికి ఆయన హాజరై మాట్లా డారు. ఇప్ప టికే మెదక్ జిల్లా గజ్వేల్ వరకు భూసే క రణ పూర్త యిం దనీ, జిల్లాలో32 కిలో మీ టర్ల మేర భూమి సే క రిం చాల్సి ఉంద న్నారు. పనులు పూర్త యితే వస్త్ర పరి శ్ర మకు కేంద్ర బిందు వైన సిరి సిల్ల, దక్షిణ కాశీ వేము లవా డకు మహ ర్దశ పట్ట నుం దని అభి ప్రా య ప డ్డారు.

కొత్తపల్లి, మనోహరాబాద్ రైలుమార్గం నిర్మాణంతో కార్మిక, ధార్మిక క్షేత్రాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పొదుపు భవనంలో సోమవా రం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన భూనిర్వాసితుల సమావేశంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. వస్త్రపరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్ల, వేములవాడ పుణ్యక్షేత్రాలతో పాటు సిద్దిపేట ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు 2007 లో ఎంపీగా పనిచేసిన సీఎం కేసీఆర్ కొత్తపల్లి-మనోహరాబాద్ రైలుమార్గాన్ని మంజూరు చేయించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మార్గం పనులను వేగవంతమైనట్లు చెప్పారు.

లైన్ నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం, రైలు ప్రారంభించిన తర్వాత ఐదేళ్లపాటు వచ్చే నష్టాలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం విధించిన షరతులకు సీఎం లిఖిత పూర్వకంగా రైల్వేశాఖకు లేఖ రాయడంతో ఈ ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చినట్లు తెలిపారు. మనోహరాబాద్ నుంచి మెదక్ జిల్లా గజ్వేల్ వరకు భూసేకరణ పూర్తయిందని, రాజ న్న సిరిసిల్ల జిల్లాలో 32కిలోమీటర్ల రైల్వేలైన్ కోసం భూసేకరణ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ రైలు మార్గం నిర్మాణం పూర్తయితే జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంత వాసులంతా నేరుగా హైదరాబాద్‌కు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. భూసేకరణలో ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎంపీ సూచించారు.

-15 రోజుల్లో మళ్లీ సమీక్ష


కొత్తపల్లి, మనోహరాబాద్ రైలుమార్గం భూసేకరణపై మళ్లీ 15రోజుల్లో సమీక్షిస్తానని ఎంపీ తెలిపారు. సిరిసిల్ల బైపాస్‌రోడ్డులో భూనిర్వాసితులకు జరుగుతున్న నష్టాలను తగ్గించే ప్రయత్నం చేస్తానన్నారు. కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జాతీయ రహదారులుగా కేంద్ర ప్రకటించిందని, ఈ రైలు మార్గానికి రహదారులు అడ్డు వస్తున్నందన్నారు. దీనిపై మిషన్ భగీరథ, రెవె న్యూ, ఏడీ ల్యాండ్ సర్వే, అర్‌అండ్‌బీ, రైల్వే అధికారులతో కమిటీ వేసి సమీక్షించనున్నట్లు తెలిపారు. రైల్వేలైన్ పూర్తయితే సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందుతాయని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు అన్నారు. ప్రస్తుతం రూ.4వందల కోట్లతో పుణ్యక్షేత్రం అభివృద్ధి చెం దనుందని, రైలుమార్గం పూర్తయితే దేశప్రజలు రాజన్నను దర్శించుకునే వీలుంటుందన్నారు. సమావేశంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసీ యాస్మిన్‌బాషా, రైల్వే ప్రాజెక్టు ఇన్‌చార్జి వెంకటేశ్వర్‌రావు, ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ వైవీశాస్త్రీ, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్, నిర్వాసితులు ఉన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS