పారిశ్రామిక నగరంగా సిరిసిల్ల

Tue,January 10, 2017 02:33 AM

రాజన్న సిరిసిల్ల, ప్రతినిధి నమస్తే తెలంగాణ ;వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్లను ప్రారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన చేనేతస్టాల్‌ను సోమవారం ఎంపీ సందర్శించి వస్ర్తాల అమ్మకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ విలేకరులతో మా ట్లాడారు. జిల్లాను తెచ్చాం.. ఇక పారిశ్రామిక నగ రం ఏర్పాటు చేయడం తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. తెలంగాణకే వెన్నుముక అయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను అన్ని రంగాలలో ముం దుకు తీసుకెళ్లేందుకు మంత్రి కేటీఆర్ కృషిచేస్తున్నారని కొనియాడారు. పారిశ్రామిక నగరం ఏర్పాటులో భాగంగా కేటీఆర్‌ను తీసుకుని ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు.

-చేనేత పరిశ్రమను కాపాడుకుందాం


చేనేత వస్త్ర పరిశ్రమను కాపాడుకునేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలంతా నేత దుస్తులు ధరించాలని ఎంపీ పిలుపునిచ్చారు. ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించాలని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు యువత ఆ వైపు ఆకర్శితులవుతున్నట్లు తెలిపారు. అనేక మంది చేనేత వస్ర్తాలను ధరిస్తున్నారని, అధికారులు, ప్రజలు ఆదరించాలని కోరారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, కలెక్టర్, జేసీ, డీఆర్వో, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, వైస్‌చైర్మన్ శ్రీనివాస్, రామారావు, కౌన్సిలర్లు అరుణ, అనూష, శ్రీనివాస్ పాల్గొన్నారు.

-క్యాలెండర్ ఆవిష్కరణ


సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ నూతన సం వత్సర క్యాలెండర్‌ను ఎంపీ, ఎమ్మెల్యే రమేశ్‌బా బు ఆవిష్కరించారు. సెస్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు కుంబాల మలారెడ్డి, కొక్కు దేవేందర్‌యాదవ్, ఏనుగు విజయరామారావు, తిరుపతి, మున్సిపల్ చైర్‌పర్సన్ పావని పాల్గొన్నారు.

232
Tags

More News

మరిన్ని వార్తలు...