విద్యారంగానికి అధిక ప్రాధాన్యం: ఎంపీ

Tue,January 10, 2017 02:32 AM

సిరిసిల్లటౌన్: రాష్ట్రప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమర్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన సోమవారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన ట్రస్మా కార్యాలయాన్ని సందర్శించి మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ట్రస్మా కీలకపాత్ర పోషించిందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ట్రస్మా భాగస్వా మ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం బతు కు, బతుకించు అన్న నినాదంతో ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయని, సర్కార్ బళ్లను బతికించాలనడంలో మొదటి వ్యక్తిని తానేనన్నారు. విద్యాబోధనలో ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత కల్పించడం ముఖ్యమని అన్నారు. ప్రైవేటు పాఠశాలల సమస్యలను ఢిల్లీస్థాయికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు పోటీ ఉండకూడదని తెలిపారు. ప్రభుత్వం రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యను అందించాలని యాజమాన్యాలకు సూచించారు. జిల్లాకేంద్రంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆయా సబ్జెక్టులపై శిక్షణ ఇవ్వాలన్నా రు. రాష్ట్రంలో మెరుగైన విద్య, వైద్య అందుబాటులోకి తీసుకురవాలన్న సంకల్పంతో ప్రభుత్వం బడ్జెట్‌లో విద్య, వైద్యానికి అధిక నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. పదో తరగతి వరకు ప్రస్తుతం తెలుగు మీడియం నిర్వహణకు ఉన్న అనుమతులను ఇంగ్లీష్ మీడియం తరగతుల బోధన కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ట్రస్మా నేతలు ఎంపీని కోరగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు.

ట్రస్మా పట్టణాధ్యక్షుడు గుగ్గిళ్ల జగన్‌గౌడ్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ అధ్యక్షురాలు సామల పావని, సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, సెస్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, గణేశ్, నాగుల శ్రీనివాస్‌గౌడ్, కోట మనోహర్, రవిశంకర్, నరాల దేవేందర్, శ్రీనివాస్, కల్వకుంట్ల నాగేశ్వర్‌రావ్, శంకర్‌రావ్, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...